Tomota in Nasa: అంతరిక్షంలో మిస్సయిన టమాటాలు దొరికాయి.! పెద్ద మార్పులు లేవన్న శాస్త్రవేత్తలు.
అంతరిక్షంలో 2 టమాటాలుతప్పిపోయాయి. వాటి గురించి తెగ వెతికారు.. అయినా దొరకలేదు. సరేలే.. రెండు టామాలే కదా అని లైట్ తీసుకున్నారు. అయితే ఆ టమాటాలే ఇప్పుడు సైంటిస్టులకు సరికొత్త వివరాలు తెలిపాయి. అయితే అప్పుడు మిస్సయిన టమాటాలు ఇప్పుడు దొరికాయి. ఈ టమాటాలు మిస్సయ్యి 8 నెలలు తర్వాత దొరికాయి. ఇక్కడ విశేషమేంటంటే.. చెట్లనుంచి టమాటాలు తెంచి 8 నెలలు గడచినా వాటిలో పెద్దగా మార్పులేదని తేలింది.
అంతరిక్షంలో 2 టమాటాలుతప్పిపోయాయి. వాటి గురించి తెగ వెతికారు.. అయినా దొరకలేదు. సరేలే.. రెండు టామాలే కదా అని లైట్ తీసుకున్నారు. అయితే ఆ టమాటాలే ఇప్పుడు సైంటిస్టులకు సరికొత్త వివరాలు తెలిపాయి. అయితే అప్పుడు మిస్సయిన టమాటాలు ఇప్పుడు దొరికాయి. ఈ టమాటాలు మిస్సయ్యి 8 నెలలు తర్వాత దొరికాయి. ఇక్కడ విశేషమేంటంటే.. చెట్లనుంచి టమాటాలు తెంచి 8 నెలలు గడచినా వాటిలో పెద్దగా మార్పులేదని తేలింది. టమాటాలులో నీటిశాతం తగ్గి, కొంత రంగు మారి, కొంచెం మెత్తబడ్డాయి తప్ప అవేమీ చెడిపోలేదన్నారు నాసా శాస్త్రవేత్తలు. సూక్ష్మజీవులు లేదా శిలీంధ్రాల పెరుగుదల వాటిలో కనిపించలేదని స్పష్టం చేశారు. మట్టి లేని మొక్కల పెంపక ప్రయోగం ‘ఎక్స్‌పోజ్డ్ రూట్ ఆన్-ఆర్బిట్ టెస్ట్ సిస్టమ్’లో భాగంగా అంతరిక్షంలో వ్యోమగామి ఫ్రాంక్ రూబియో రెండు చిన్నచిన్న టమాటాలను తెంపుతున్న సమయంలో అవి చేతల నుంచి జారి పోయాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తిరుగాడిన టమాటాలను ఎట్టకేలకు 8 నెలల తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగులో గుర్తించారు.
తొలుత టమాటాలు కనిపించడం లేదని ఫ్రాంక్ రూబియో చెబితే, ఆయనే తినేసి ఉంటారని సహచర వ్యోమగాములు సరదాగా పంచులు వేశారని, ఎట్టకేలకు అవి కనిపించాయని, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బంది ఇటీవలే వాటిని గుర్తించారని నాసా వివరించింది. కాగా మట్టి లేదా ఇతర వృద్ధి మాధ్యమాలు లేకుండా మొక్కల పెంపకంపై దృష్టి సారించిన నాసా ఎక్స్‌రూట్స్ ప్రయోగాన్ని చేపట్టింది. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతుల ద్వారా మొక్కల పెంపకంపై ప్రయోగాలు చేస్తోంది. ద్రవ్యరాశి, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర అంశాల కారణంగా ప్రస్తుతం అంతరిక్ష వాతావరణంలో మొక్కలు చక్కగా పెరగకపోవచ్చునని, ఎక్స్‌రూట్ ప్రయోగం విజయవంతమైతే మట్టి తక్కువ పద్ధతుల్లో భవిష్యత్తులో మొక్కల విధానాలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నట్టు నాసా పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.