ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ

Updated on: Mar 13, 2026 | 7:13 PM

నంద్యాల జిల్లా పాణ్యం వస్త్ర వ్యాపారి వినూత్న నిర్ణయం అందరినీ ఆకర్షిస్తోంది. మతిస్థిమితం లేని సుంకమ్మతో తన కొత్త దుకాణాన్ని ప్రారంభించి, రాజకీయ హంగామాకు దూరంగా నిలిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరివేస్తూ స్వచ్ఛతకు కృషి చేసే సుంకమ్మను గౌరవించడం ద్వారా వ్యాపారి గొప్ప మనసు, పర్యావరణ స్పృహ చాటుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

సాధారణంగా ఏదైనా కొత్త వ్యాపారం లేదా షోరూమ్ ప్రారంభిస్తే.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులనో, సెలబ్రిటీలనో పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తారు. కానీ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఓ వస్త్ర వ్యాపారి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లోకం దృష్టిలో మతిస్థిమితం లేని మహిళగా ముద్రపడిన ఒక అభాగ్యురాలితో తన కొత్త దుకాణాన్ని ప్రారంభించి, సరికొత్త ఓరవడికి శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా కందికాయపల్లెకు చెందిన సుంకమ్మ అనే మహిళ మతిస్థిమితం లేక పాణ్యం మండల కేంద్రంలో తిరుగుతూ ఉంటుంది. అయితే, ఆమె ప్రవర్తన అందరిలా ఉండదు. ఎవరూ చెప్పకపోయినా, ప్రతిరోజూ బస్టాండు మరియు షాపుల ముందు పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వచ్ఛందంగా ఏరివేస్తూ పరిసరాలను శుభ్రం చేస్తుంది. ఎవరో ఇచ్చే చిల్లర డబ్బులతో కడుపు నింపుకుంటూ, సమాజానికి మాత్రం తన వంతుగా ‘స్వచ్ఛత’ను అందిస్తోంది. సుంకమ్మ పనులను ప్రతిరోజూ గమనిస్తున్న ఒక స్థానిక వస్త్ర వ్యాపారి ఆమె నిబద్ధతకు ముగ్ధుడయ్యారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతిఫలం ఆశించకుండా శ్రమిస్తున్న సుంకమ్మే తన షాపు ప్రారంభోత్సవానికి సరైన వ్యక్తి అని భావించారు. అనుకున్నదే తడవుగా, ఆ అభాగ్యురాలిని సాదరంగా ఆహ్వానించి, ఆమె చేతుల మీదుగానే తన నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభోత్సవం చేయించారు. రాజకీయ హంగామాలు లేవు, ఆర్భాటాలు లేవు.. కేవలం మానవత్వం మరియు పర్యావరణ స్పృహ మాత్రమే అక్కడ కనిపించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన స్థానికులు సదరు వ్యాపారి గొప్ప మనసును అభినందిస్తున్నారు. “అందరూ పిచ్చిది అని వెటకారం చేస్తున్నా.. ఆమె చేస్తున్న పనిని గుర్తించి గౌరవించడం అద్భుతం” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు

కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు

జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

తెలంగాణలో ఒంటిపూట బడులు – పూర్తి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !! మీ కోసం సరికొత్త టెక్నాలజీ ప్రారంభం

Follow Us