Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

Updated on: May 14, 2026 | 7:49 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో హృదయాలను కదిలించే అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కోతులు, కుక్కల మధ్య వైరం ఉండగా... ఓ వానరం మాత్రం అనాథ కుక్క పిల్లను తన బిడ్డలా చేరదీసి ప్రేమగా పెంచుతోంది. ఆకలిగా ఏడిస్తే పాలు ఇచ్చి ఆదరిస్తుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అరుదైన దృశ్యాల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమ్మ ప్రేమకు జాతి, భాష అనే భేదాలు ఉండవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వింత సంఘటన జరిగింది. సహజంగా కుక్కలకు, కోతులకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ ఒక వానరం మాత్రం ఆ వైరాన్ని మరచి, ఒక అనాథ కుక్క పిల్లను చేరదీసి తన బిడ్డలా సాకుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డులో వారం రోజుల క్రితం కోతుల గుంపు సందడి చేసింది. అందులో ఒక కోతి, ఓ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్న కుక్క పిల్లను చూసి ముచ్చటపడింది. దానితో కాసేపు ఆడుకున్న తర్వాత, ఆ పిల్లను వదలలేక తన చేతుల్లోకి తీసుకుని వెంట తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ కుక్క పిల్ల ఆ వానర సైన్యంలో ఒక భాగమైపోయింది. ఆ కోతి కుక్క పిల్లను కేవలం తనతో తిప్పుకోవడమే కాకుండా, అది ఆకలితో ఏడిస్తే మాతృత్వంతో పాలు ఇచ్చి ఆకలి తీరుస్తోంది. పట్టణంలోని వీధుల్లో ఆ కోతి… కుక్క పిల్లను గుండెలకు హత్తుకుని తిరుగుతున్న దృశ్యాలు చూసి స్థానికులు విస్తుపోతున్నారు. మనుషుల మధ్య కనుమరుగవుతున్న మానవత్వం… నోరు లేని జీవాల మధ్య కనిపిస్తుండటంతో ఈ దృశ్యం జంతు ప్రేమికులను కదిలిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అమ్మ ప్రేమకు భాష, జాతి భేదాలు లేవని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు

బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్‌

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు

ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా

Follow Us