గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..

Updated on: Feb 17, 2026 | 5:58 PM

జన్యు సమస్యలను నివారించే లక్ష్యంతో పూర్వీకులు రూపొందించిన ‘పంజీ ప్రథ’ మిథిలలో దాదాపు 700 ఏళ్లుగా కొనసాగుతోంది. పంజీకార్లు వధూవరుల ఏడు తరాల గోత్ర సంబంధాలను పరిశీలించి, రక్త సంబంధీకులు కాదని నిర్ధారిస్తారు. ఆరోగ్యకరమైన సంతానం కోసం ఈ ప్రత్యేకమైన వివాహ వ్యవస్థను మైథిల్‌ బ్రాహ్మణులు, కర్ణ కాయస్థులు నేటికీ అనుసరిస్తున్నారు. అయితే, పంజీకార్లకు తగిన ప్రోత్సాహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఒకే గోత్రం ఉన్నవారు, దగ్గరి రక్త సంబంధీకులు పెళ్లి చేసుకోవద్దని మన పూర్వీకులు ఆలోచించారు. జన్యు సమస్యల నుంచి పిల్లలను కాపాడే గొప్ప లక్ష్యంతో ‘పంజీ ప్రథా’ అనే వ్యవస్థను తీసుకొచ్చారు. బిహార్‌లోని మిథిలలో దాదాపు 700 ఏళ్లుగా ఓ కుటుంబం వధువు వరుడి వివరాలను పుస్తకాల్లో రికార్డ్‌ చేస్తూ వస్తోంది. మైథిల్‌ బ్రాహ్మణులు, కర్ణ కాయస్థ వర్గం వారిలో చాలామంది నేటికీ ఇదే వివాహ వ్యవస్థను అనుసరిస్తున్నారు. వివాహ సంబంధాలకు పంజీకార్‌ను సంప్రదిస్తారు. పంజీకార్‌ అంటే వివాహ వివరాలను నమోదు చేసి, ఆ రికార్డులను నిర్వహించే నిపుణుడు. వచ్చిన పెళ్లిసంబంధం వివరాలను పంజీకార్‌కు చూపితే, ఆయన తన దగ్గరున్న పాత రికార్డుల చిట్టాను విప్పుతారు. గోత్రం ఆధారంగా వరుడి ఏడు తరాలు, వధువు తాలూకు అయిదు తరాల సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తారు. ఏక గోత్రం, రక్తసంబంధం వంటి సమస్యలేవీ లేకపోతే.. పెళ్లికి అభ్యంతరం లేదంటూ సిద్ధాంత పత్రాన్ని అందచేస్తారు. అనంతరం ఆ వధూవరుల పెళ్లికి ఏర్పాట్లు మొదలవుతాయి. మిథిల చివరి రాజు హరిసింగ్‌ దేవ్‌ 1325లో పంజీ ప్రథా వ్యవస్థకు శ్రీకారం చుట్టారట. బిహార్‌లో సౌరథ్‌ సభ అనే చారిత్రక గ్రామం ఉంది. గ్రామంలోని 22 ఎకరాల భూమిని వివాహ వేడుకల కోసం వాడతారు. ఏటా సీజనులో ఇక్కడ పెద్దసంఖ్యలో మైథిల్‌ బ్రాహ్మణుల సామూహిక వివాహాలు జరుగుతుంటాయి. ఈ 22 ఎకరాల భూమిని పంజీకార్‌లకు మహారాజు దానం చేశారని చెబుతారు. నేటికీ సౌరథ్‌ సభ గ్రామంలో పంజీకార్లు ఆరోగ్యకరమైన భావితరాల సాధనకు పాటుపడుతున్నారు. అయితే పంజీప్రథా రికార్డుల వ్యవస్థను డిజిటలైజ్‌ చేయాలని కొందరు కోరుతున్నారు. సాధారణంగా పంజీకార్‌లుగా పనిచేసినవారి పిల్లలే మళ్లీ ఆ వృత్తిలోకి వస్తుంటారు. ఇప్పుడీ పని చేసేవారికి అరకొర జీతాలే రావడంతో పంజీకార్‌ అయ్యేందుకు చాలామంది యువత ఆసక్తి చూపడం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాత్‌రోబ్‌లో కాలేజీకి.. ఐ డోంట్‌ కేర్‌ అంటూ సందేశం.. అమెరికాలో శవమైన విద్యార్థి సాకేత్‌

నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి

సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు

CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు

KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు

Follow Us