అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు కొప్పినీడి విజయ్ మోహన్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. మహా శివరాత్రికి పెన్సిల్ మొనపై పరమశివుడిని చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గిన్నిస్, లిమ్కా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులు సాధించిన ఆయన, బియ్యపు గింజలపై జాతీయ గీతం లిఖించి, 1200కు పైగా కళాఖండాలతో పాటు 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆయన సృజనాత్మకతకు పట్టుదలే ఆధారం.
కంటికి కనిపించి కనిపించని సూక్ష్మ కళలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కొప్పినీడి విజయ్ మోహన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, పెన్సిల్ మొనపై పరమశివుని ఆకృతిని అత్యంత నైపుణ్యంతో చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి సూక్ష్మ పరికరాలను వాడకుండా, కేవలం గంటన్నర వ్యవధిలోనే ఈ కళాఖండాన్ని రూపొందించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. విజయ్ మోహన్ ప్రయాణం కేవలం శివుని ప్రతిమతోనే ఆగలేదు. ఆయన ఖాతాలో ఎన్నో ప్రపంచ స్థాయి రికార్డులు ఉన్నాయి. పెన్సిల్ లీడ్‌పై ఏకంగా 246 లింకులు ఉన్న గొలుసును చెక్కి, 2021లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. 2019లో కేవలం అంగుళం ఎత్తులో జ్యూస్ తయారు చేసే యంత్రం, మజ్జిగ చిలికే యంత్రాన్ని రూపొందించి రెండు లిమ్మా బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పారు. అంతేకాదు, 2018లో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించారు. అదెలాగంటే.. మూడు బియ్యపు గింజలపై తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో జాతీయ గీతాన్ని 9 గంటలపాటు శ్రమించి లిఖించి రికార్డు సృష్టించారు. 2018లోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘రాష్ట్రీయ యువ గౌరవ అవార్డు’ అందుకున్న విజయ్ మోహన్, ఇప్పటివరకు 1200కు పైగా సూక్ష్మ కళాఖండాలను రూపొందించారు. 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న ఆయనను చూసి జిల్లా ప్రజలు గర్వపడుతున్నారు. “సృజనాత్మకతకు భాష లేదు.. పట్టుదల ఉంటే పెన్సిల్ మొనపై ప్రపంచాన్ని సృష్టించవచ్చు” అని విజయ్ మోహన్ నిరూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త
తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ
హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్
ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో
Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
