Man Cooked First time: 7,80,000 ఏళ్ల క్రితం.. మానవుడు తొలిసారి ఆహారం.. వండుకున్నాడు.. ఇదిగో సాక్షం..

|

Nov 26, 2022 | 9:59 AM

దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది. అయితే,


దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్‌ బెనోట్‌ యాకోవ్‌ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది. అయితే, ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్లు వెల్లడైంది.తాజా పరిశోధనలో 7,80,000 క్రితమే మానవులు మంటను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి టెల్‌ అవివ్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఇరిట్‌ జొహర్‌ అనే పరిశోధకుడి నేతృత్వం వహించారు. ‘ ఎలాంటి పరికరాలు లేని ఆరోజుల్లోనే మంటను నియంత్రిస్తూ వంట చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆది మానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యమిచ్చేవారని తెలిసింది. చేపను వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ఆనాడే వారు గుర్తించినట్లు తెలుస్తోంది’ అని జొహర్‌ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us on