11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా గంజ్ బసోడాలో విషాదం చోటుచేసుకుంది. మూడో అంతస్తు బాల్కనీలో గుట్కా ఉమ్మివేసే సమయంలో 11 కేవీ హైటెన్షన్ వైర్ సమీపంలో విద్యుత్ ప్రమాదం జరగడంతో 65 ఏళ్ల ప్రభులాల్ గుప్తా మృతి చెందాడు. ఇళ్లకు దగ్గరగా ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలపై గతంలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యుత్ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లా గంజ్ బసోడాలో విషాదం చోటుచేసుకుంది. గుట్కా ఉమ్మివేసే క్రమంలో 11kV హై-టెన్షన్ విద్యుత్ వైర్ తాకడంతో 65 ఏళ్ల ప్రభులాల్ గుప్తా అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఛతర్‌పూర్‌కు చెందిన ప్రభులాల్ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ గాయత్రి నగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన మూడో అంతస్తు బాల్కనీలో నిలబడి గుట్కా ఉమ్మివేయడానికి వంగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బాల్కనీకి చాలా దగ్గరగా వెళ్తున్న 11 కేవీ హై-టెన్షన్ వైర్‌ను ఆయన లాలాజల ప్రవాహం తాకడంతో విద్యుత్ క్షణాల్లో ఆయన శరీరానికి ప్రసరించింది. దీంతో శరీరంపై ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మానవ లాలాజలంలో ఉండే లవణాలు, ఎలక్ట్రోలైట్లు విద్యుత్‌కు మంచి వాహకంగా పనిచేస్తాయని నిపుణులు వివరించారు. నిరంతర ధారగా పడిన ఉమ్మినీటి ద్వారా కరెంట్ నేరుగా ప్రసరించడమే కాకుండా, 11 కేవీ లైన్ల వద్ద ఉండే ‘ఎలక్ట్రికల్ ఆర్కింగ్’ వల్ల గాలి ద్వారా కూడా విద్యుత్ ప్రసరించి ఈ ఘోరం జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు విద్యుత్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లకు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న హై-టెన్షన్ వైర్లను తొలగించాలని పదేపదే ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని, వారి నిర్లక్ష్యమే ఈ ప్రాణ నష్టానికి కారణమని భవన యజమాని మరియు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్లకే చిన్నారి అద్భుతం.. తబలాపై 12 తాళాలు వాయించి రికార్డ్
ఇంజనీరింగ్ చేయని ఇంజనీర్.. ఎగిరే కారును సృష్టించిన యువకుడు
ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!
ఓడిన సర్పంచ్‌కి గ్రామస్తులు సత్కారం!
WhatsApp: వాట్సాప్ నుంచే ఇన్‌స్టా రీల్స్ షేర్.. అదిరిపోయే కొత్త ఫీచర్!
