సింగరేణి ఖిల్లాలో ‘అమెరికా’ కోడలు
అమెరికా అమ్మాయి లవినశ్రీ (తమీ) మరియు తెలంగాణ అబ్బాయి ప్రణీత్ మంచిర్యాలలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అమెరికాలో పరిచయం ప్రేమగా మారగా, ఇరు కుటుంబాలు అంగీకరించి పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. ఇది భాషలు, సంస్కృతులు, ఖండాలు దాటిన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. విదేశీ బంధువులు భారతీయ ఆచారాలకు ముగ్ధులయ్యారు. ఈ విదేశీ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రేమకు సరిహద్దులు లేవని, ఖండాలు దాటినా మనసులు కలవాల్సిందేనని మరో జంట నిరూపించింది. ఏడు సముద్రాల అవతల ఉన్న అమెరికా అమ్మాయి.. సింగరేణి గడ్డపై ఉన్న తెలంగాణ అబ్బాయి ప్రేమలో పడటమే కాదు, పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జరిగిన ఈ విదేశీ వివాహం ఇప్పుడు స్థానికంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. నస్పూర్ కు చెందిన గంగిపల్లి రాములు కుమారుడు ప్రణీత్, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అమెరికాకు చెందిన లవినశ్రీ అలియాస్ తమీతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కాలని నిశ్చయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలపగా, వారు కూడా పచ్చజెండా ఊపారు. మంచిర్యాలలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వధువు బంధువులు కూడా భారతీయ సంప్రదాయాలకు ముగ్ధులయ్యారు. ప్రణీత్ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా, మూడు ముళ్ళు వేసి, ఏడడుగులు నడిచి తమీని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. కొత్త జంటను ఆశీర్వదించడానికి బంధుమిత్రులు భారీగా తరలివచ్చారు. భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా ప్రేమ ముందు అన్నీ సమానమేనని ఈ జంట నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్ విద్యార్ధినిలు..
నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్.. బ్లాక్‌పై అన్వేష్ సెటైర్లు
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా