Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

Updated on: Mar 02, 2026 | 12:02 PM

వారణాసిలో జరిగే మసానే హోలీ ఒక అరుదైన సంప్రదాయం. రంగభరి ఏకాదశి మరుసటి రోజున శివ భక్తులు, అఘోరాలు స్మశానవాటికలో మండుతున్న చితుల నుంచి సేకరించిన చితా భస్మంతో హోలీ ఆడతారు. మరణం అనేది అంతిమ సత్యమని, దానికి భయపడకూడదని ఈ పండుగ చాటి చెబుతుంది. ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.

వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు. వారణాసిలో హోలీ పండగ సాధారణ రంగులతో కాకుండా, స్మశానవాటికలో మండుతున్న చితుల మధ్య చితా భస్మం తో ప్రారంభమవుతుంది. ఏటా ‘రంగభరి ఏకాదశి’ మరుసటిరోజు శివ భక్తులు, అఘోరాలు, నాగ సాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్‌ కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. డమరుక నాదాలు, “హర హర మహాదేవ్” నినాదాల మధ్య గంటల తరబడి సాగే ఈ వేడుకను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తారు. సాధారణంగా స్మశానం అంటే భయం, నిశ్శబ్దం ఉంటుంది, కానీ కాశీలో మాత్రం మరణాన్ని కూడా ఒక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత. పురాణాల ప్రకారం.. రంగభరి ఏకాదశి రోజున శివుడు పార్వతీ దేవితో కలిసి కాశీకి వస్తాడు. ఆ రోజున దేవతలు, మానవులతో కలిసి శివుడు రంగుల హోలీ ఆడతాడు. శివుని వెంట ఉండే భూత ప్రేత పిశాచాలు, గణాలకు ఆ రోజున అందరితో కలిసి రంగులాడే అవకాశం లభించదు. అందుకే మరుసటి రోజున తన ప్రియమైన గణాల కోసం శివుడు స్వయంగా స్మశానవాటికకు వచ్చి చితి భస్మంతో హోలీ ఆడతారని భక్తుల నమ్మకం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంటే.. మరణం అనేది జీవితంలో అంతిమ సత్యమని, దానికి భయపడాల్సిన అవసరం లేదని చాటి చెప్పడమే. భౌతిక బంధాల నుంచి విముక్తిని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ఈ ‘మసానే కీ హోలీ’ చెబుతుందని.. అక్కడివారు నమ్ముతారు. అందుకు వారణాసిలో కాలుతున్న చితుల మధ్యనే ఈ వేడుకను కోలాహలంగా చేసుకుంటారు. హోలీ పండుగకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. రాక్షస రాజు హిరణ్యకశిపుడి మరణం తర్వాత నుంచి ప్రజలు ఈ హోలీ పండుగను చేస్తూ వస్తున్నారనీ పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కులం, మతం, పేద, ధనిక అనే తేడాలు లేకుండా అందరూ ఒకరికి ఒకరు రంగులు పూసుకుని కలిమెలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. పాత గొడవలను మర్చిపోయి, శత్రువులను సైతం హత్తుకుని స్నేహపూర్వకంగా ఉండాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం

March 2026 Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే

Loading...
Unable to load recommendations.
Follow Us