బంపర్ ఆఫర్.. కుక్కలను పట్టుకుంటే పైసలే.. పైసలు..
రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా వెంటాడి వేటాడిమరీ దాడులు చేస్తున్నాయి. తీవ్ర గాయలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు.. ఈ క్రమం లో కుక్కలను పట్టుకునేందుకు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, సమీప గ్రామాల్లో వీధి కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు.
రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా వెంటాడి వేటాడిమరీ దాడులు చేస్తున్నాయి. తీవ్ర గాయలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు.. ఈ క్రమం లో కుక్కలను పట్టుకునేందుకు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, సమీప గ్రామాల్లో వీధి కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌లో సుమారు 10 వేల కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రోజు 10 నుండి 15 వీధి కుక్కలను పట్టుకుని వాటికి వైద్యం అందిస్తున్నారు. మగ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు రోజుల వరకు పశు వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారు. ఏవైనా ఇతర రోగాలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరినైనా కరిచిన ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకు తగు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు .వీధి కుక్కలను మళ్ళీ పట్టుకున్న చోటే వదిలేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు కాంట్రాక్టు బాధ్యతలు అప్పజెప్పారు. ఒక్కో కుక్కను పట్టుకునేందుకు సుమారు 1,650 రూపాయలను చెల్లిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు !! కోరిన కోర్కెలు తీర్చేస్తాడట
మనిషి రూపంలో వినాయకుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడో తెలుసా ??
కిలాడీ లేడీలు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ఏం చేశారో చూడండి