IRCTC Room: రైల్వే స్టేషన్‌లోనే రూమ్.! ఐఆర్‌సీటీసీ కొత్త సదుపాయం. ఇలా బుక్ చేసుకోవచ్చు
ఉద్యోగం, వ్యాపారం అంటూ.. నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమో, ప్రమాదాల కారణంగానో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. లేదంటే ప్రయాణికులే వేరే రైలు అందుకోవడం కోసం రైల్వేస్టేషన్‌లో గంటల తరబడి ఎదురుచూడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు బయట ఏ హోటల్ గదిలోనో బస చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది.
ఉద్యోగం, వ్యాపారం అంటూ.. నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడమో, ప్రమాదాల కారణంగానో రైళ్లు ఆలస్యం అవుతుంటాయి. లేదంటే ప్రయాణికులే వేరే రైలు అందుకోవడం కోసం రైల్వేస్టేషన్‌లో గంటల తరబడి ఎదురుచూడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు బయట ఏ హోటల్ గదిలోనో బస చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీ సదుపాయాన్ని అందిస్తోంది. చాలా మందికి దీని గురించి సరైన అవగాహన లేదు. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఐఆర్‌సీటీసీ ఈ రిటైరింగ్ రూమ్స్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. చాలా తక్కువ ఖర్చుతోనే ఈ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ తరహా గదులు అందుబాటులో ఉంటాయి. కనిష్ఠంగా గంట నుంచి గరిష్ఠంగా 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రాంతాన్ని బట్టి రూమ్ బుకింగ్ ఛార్జీలు రూ.100 నుంచి రూ.700 వరకు ఉంటాయి. టికెట్ రిజర్వేషన్ ఓకే అయిన వ్యక్తులు మాత్రమే ఈ రూమ్స్ బుకింగ్ చేసుకోవటానికి వీలుంటుంది. వెయిట్-లిస్ట్‌లోని ప్రయాణికులకు ఈ సదుపాయం ఉండదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ రిటైరింగ్ రూమ్స్‌ను ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.