అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??
ఎలుకలు ఇంట్లోకి వస్తే మనం చాలా ఇబ్బందిగా ఫీలవుతాం. వాటిని తరిమికొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిని వదిలించుకోవడానికి చాలా రకాల చిట్కాలను ఉపయోగిస్తుంటాం.
ఎలుకలు ఇంట్లోకి వస్తే మనం చాలా ఇబ్బందిగా ఫీలవుతాం. వాటిని తరిమికొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. వాటిని వదిలించుకోవడానికి చాలా రకాల చిట్కాలను ఉపయోగిస్తుంటాం. అయితే అరటిపండ్లు కనిపిస్తే చాలు ఎలుకలు భయపడి పారిపోతాయని మీకు తెలుసా.. అరటిపండ్ల నుంచి వచ్చే వాసన ఎలుకలకి అస్సలు పడదట. అందుకే ఎలుకలు పారిపోతాయని ఓ పరిశోధనలో తేలింది. అరటిపండ్ల వాసనను చూస్తే ఎలుకలు ఒత్తిడికి గురవుతాయట.. వాటిలో ఓ రకమైన హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనలో తేలింది. అరటిపండ్ల వాసనలో N-పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం కారణంగా, ఎలుకలో ఉద్రిక్తత ఏర్పడుతుందని వారు తేల్చారు. అరటిపండ్ల నుంచి ఎలుకలు పారిపోతాయని పరిశోధనలో రుజువైనప్పటికీ.. పారిపోయేది మాత్రం మగ ఎలుకలు మాత్రమే అని వారు స్పష్టం చేశారు. ఎందుకంటే అరటిపండ్లలో ఉండే ఆ కెమికల్ సమ్మేళనం ఆడ ఎలుకల మూత్రం నుంచి వచ్చే వాసన ఓకేలా ఉంటుందట.. మగ ఎలుకల నుంచి తమ పిల్లలను దూరంగా ఉంచడానికి ఆడ ఎలుకలు తమ మూత్రంలో ఒక ప్రత్యేక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయట. ఈ రసాయనం మగ ఎలుకలో ఒత్తిడిని కలిగిస్తుందట. అందుకే ఆ వాసన వచ్చేవైపు మగ ఎలుకలు వెళ్లకుండా జాగ్రత్తపడతాయట. అయితే ఆడ ఎలుకలు మాత్రం అరటి పండ్లను చాలా ఇష్టపడతాయట. క్యూబెక్‌లోని మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ విషయాన్ని కనుగొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగిని డ్యాన్స్ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం
వీల్‌ఛైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు
డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??
మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు..