ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

Updated on: Feb 19, 2026 | 11:27 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఆమె ప్రేమికుడు పీయూష్ అనుమానంతో గొంతు కోసి చంపాడు. అనంతరం సాక్ష్యాలు చెరిపి, మహారాష్ట్ర పారిపోయాడు. అక్కడ మృతురాలి ఆత్మను రప్పించేందుకు తాంత్రిక పూజలు చేశాడు. పోలీసులు కాల్ డేటా ఆధారంగా పీయూష్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఇండోర్‌కు చెందిన సదరు యువతి ఎంబీఏ చదువుతోంది. పీయూష్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఆమె వేరే వ్యక్తులతో చాటింగ్ చేస్తోందనే అనుమానం పీయూష్‌లో బలపడింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆవేశానికి లోనైన పీయూష్ ఆమె గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు పీయూష్ ప్రయత్నించాడు. మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్‌లో బస చేసి, తాను చంపిన యువతి ఆత్మను వెనక్కు రప్పించేందుకు గదిలో తాంత్రిక పూజలు చేసాడు. బాధితురాలి మొబైల్ ఫోన్‌ను అక్కడే ధ్వంసం చేసి పడేశాడు. ఆ పై ముంబయి చేరుకుని పోలీసులకు దొరక్కుండా రాత్రంతా లోకల్ రైళ్లలోనే తిరుగుతూ కాలక్షేపం చేశాడు. పీయూష్ ఫ్లాట్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా మంచంపై నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆమె కాల్ డేటాను విశ్లేషించగా పీయూష్‌తో చివరిసారిగా మాట్లాడినట్లు తేలింది. నిందితుడు మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nara Lokesh: సొంత ఖర్చులతోనే కొలంబో వెళ్లాను.. కౌంటర్ ఇచ్చిన లోకేష్

Renigunta: రేణిగుంటలో.. కత్తితో ప్రజలను భయపెట్టిన సైకో

Case Filed on Blinkit: ఢిల్లీలో బ్లింకిట్‌ పై కేసు.. కారణం

India AI Impact Summit: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రోబో డాగ్ రచ్చ

Pratyusha: అసలు ప్రత్యూష సిద్ధార్ధరెడ్డి ఎందుకు విషం తాగారు.?

Follow Us