Care Workers: బ్రిటన్ లో కేర్‌టేకర్లపై తీవ్ర వేధింపులు.! అండర్‌కవర్ ఆపరేషన్‌లో నమ్మలేని నిజాలు.
బ్రిటన్‌లో వృద్ధులకు కేర్‌టేకర్లుగా వెళ్లే విదేశీయులు తీవ్ర హింసకు గురవుతున్నారని భారతీయ జర్నలిస్టు జరిపిన అండర్‌కవర్ ఆపరేషన్‌లో తెలిసింది. భారత్ తదితర దేశాల నుంచి కేర్‌టేకర్లను నియమించుకుంటున్నారని, వారిని తీవ్రంగా వేధిస్తున్నారని వెల్లడైంది. కేరళకు చెందిన బాలకృష్ణన్ బాలగోపాల్ అనే జర్నలిస్టు స్వయంగా కేర్‌టేకర్‌గా వెళ్లి ఓ వార్తాసంస్థ కోసం ఈ విషయాలను ఇన్వెస్టిగేట్ చేసారు. ఈశాన్య ఇంగ్లాండ్‌లో ఆయన పరిశోధన సాగింది.
బ్రిటన్‌లో వృద్ధులకు కేర్‌టేకర్లుగా వెళ్లే విదేశీయులు తీవ్ర హింసకు గురవుతున్నారని భారతీయ జర్నలిస్టు జరిపిన అండర్‌కవర్ ఆపరేషన్‌లో తెలిసింది. భారత్ తదితర దేశాల నుంచి కేర్‌టేకర్లను నియమించుకుంటున్నారని, వారిని తీవ్రంగా వేధిస్తున్నారని వెల్లడైంది. కేరళకు చెందిన బాలకృష్ణన్ బాలగోపాల్ అనే జర్నలిస్టు స్వయంగా కేర్‌టేకర్‌గా వెళ్లి ఓ వార్తాసంస్థ కోసం ఈ విషయాలను ఇన్వెస్టిగేట్ చేసారు. ఈశాన్య ఇంగ్లాండ్‌లో ఆయన పరిశోధన సాగింది. కేర్‌టేకర్ల నుంచి భారతీయ నియామక సంస్థలు వేల పౌండ్లను వసూలు చేస్తున్నాయి. సుదీర్ఘ కాంట్రాక్టులను కుదురుస్తున్నాయి. మధ్యలో వదిలేసి వెళ్తే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. ఆరోగ్య రంగంలో సిబ్బంది కొరతను అధిగమించడానికి గత ఏడాది 1,40,000 మందికి బ్రిటన్ వీసాలను ఇచ్చింది. ఇందులో 39,000 మంది భారత్ నుంచే వెళ్లారు. అయితే వీరిలో చాలా మంది శ్రమ దోపిడీకి గురవుతున్నారనీ.. రుణాల బారిన పడుతున్నారనీ తేలింది. కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తోందనీ.. తప్పులు చేస్తామనే భయం వారిని వెంటాడుతోందని బాలకృష్ణన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.