Viral: కాళ్లతో తన్నితే కష్టాలు మటుమాయం.? తన్నులకోసం పెద్దసంఖ్యలో భక్తులు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండలో వింత ఆచారం అమలులో ఉంది. పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏటా స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామిని దర్శించినంతనే తమ కష్టాలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. దాదాపుగా 400 ఏళ్లనుండి ఇక్కడ హుల్తీ లింగేశ్వరస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండలో వింత ఆచారం అమలులో ఉంది. పెద్దహుల్తి గ్రామంలో వెలసిన హుల్తి లింగేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలో ప్రతి ఏటా స్వామివారికి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. స్వామిని దర్శించినంతనే తమ కష్టాలు తీరతాయని స్థానికులు నమ్ముతారు. దాదాపుగా 400 ఏళ్లనుండి ఇక్కడ హుల్తీ లింగేశ్వరస్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వామి ఓ భక్తుడిపై ఆవహించి తన కాళ్లతో తన్నుతారని, దాంతో తమ కష్టాలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఉత్సవాలు చూసేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. హుల్తి లింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తమ కోరికలు దేవునికి చెప్పుకుని, నేలపై బోర్లా పడుకుంటారు. అనంతరం స్వామి ఆవహించిన ఓ వ్యక్తి వారిని తన కాలుతో తన్నుకుంటూ వెళ్తాడు. అలా స్వామి తమను తన్నగానే తమ కష్టాలుతొలగిపోతాయని, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, సంతానం కోరుకునేవారికి సంతానం, అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఆర్ధిక ఇబ్బందులు తీరుతాయని నమ్ముతారు. స్వామి ఒక్కసారి తన్నితే చాలని ఎందరో భక్తులు నేలపై బోర్లాపడుకుని ఎదురుచూస్తారు. స్వామి పాదం తమను తాకగానే భక్తులు ఆనందంలో మునిగిపోతారు. తమ కష్టాలు తీరిపోయినట్టేనని భావిస్తారు. ప్రతి ఏటా దీపావళి తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి భవిష్యవాణి కూడా వినిపిస్తారు. ఆ ఏడాది పంటలు ఎలా పండుతాయి, ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో చెబుతారు. ఈ ఆచారం స్థానికంగా వందల ఏళ్లనుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ స్వామి తన్నుల కోసం చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.