ఇరానీ చాయ్‌, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం

Updated on: Mar 03, 2026 | 5:20 PM

ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు ఇరాన్‌తో ఉన్న శతాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ నగర రూపశిల్పి మీర్‌ మోమిన్‌ అస్త్రాబాదీ నాటి పర్షియా అంటే.. నేటి ఇరాన్ నుంచి వచ్చినవారే. ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీలు, ఆ తర్వాత పాలించిన నిజాంషాహీలు కూడా ఇరాన్‌ నుంచి వలస వచ్చినవారే . మహమ్మద్‌ కులీకుతుబ్‌ షా కొలువులో ప్రధానిగా పనిచేసిన మీర్‌ మోమిన్‌ అస్త్రాబాదీ.. 1591లో ఉద్యాన వనాలు, అద్భుత కట్టడాలతో నగరాన్ని నిర్మించారు.

గోల్కొండలోని కొన్ని కట్టడాలు, చార్మినార్‌, కుతుబ్‌ షాహీల సమాధులు.. ఇలా నగర ఖ్యాతిని ఇనుమడింపచేసే ఎన్నో వారసత్వ కట్టడాల్లో పర్షియన్‌ వాస్తు శైలి కనిపిస్తుంది. మొహర్రం ఇరాన్‌, హైదరాబాద్‌ ప్రాంతాల సాంస్కృతిక జీవనానికి ఒక వారధి. దర్వాజ, ఖర్చు, మెహఫిల్‌, దావత్‌ వంటి పర్షియన్‌ పదాలు ఇక్కడి ఉర్దూ, తెలుగులో కలిసిపోయి భాషలను సుసంపన్నం చేసాయి. బిర్యానీ, ఇరానీ చాయ్‌, హలీం అక్కడి నుంచి వచ్చినవే. ఇరానీ కేఫ్‌లు, బిర్యానీ హోటళ్లు సైతం 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇరానీలు ఇక్కడకు వచ్చి నెలకొల్పినవే. నేటికీ ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం సాగుతోంది. నేటికీ హైదరాబాద్‌ నుంచి ఔషధాలు వెళితే, అక్కడి నుంచి కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌ వస్తున్నాయి. పాత నగరంలో ఇరానీ గల్లీ ఉండగా ఇరాన్‌ దౌత్యకార్యాలయం ఉన్న బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబరు-7కు ఖమేనీ పేరు పెట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Published on: Mar 03, 2026 05:20 PM
Follow Us