వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూరపాటి నాగ వెంకట రాకేష్ కుమార్ తన లంబోర్ఘిని కారులో జిమ్ క్లీనర్‌ను కూర్చోబెట్టి అతడి కలను నెరవేర్చారు. కారును ఎంతో ఆసక్తిగా చూస్తూ ఫొటో తీసుకుంటున్న క్లీనర్‌ను గమనించిన ఆయన, స్వయంగా కారు తాళాలు ఇచ్చి డ్రైవర్ సీటులో కూర్చోమన్నారు. గతంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ పంచుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధనం ఉన్నచోట వినయం, మానవత్వం ఉండటం అరుదు. కానీ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూరపాటి నాగ వెంకట రాకేష్ కుమార్ తన ప్రవర్తనతో మానవత్వానికి కొత్త నిర్వచనం చెప్పారు. తన ఖరీదైన లంబోర్ఘిని కారులో జిమ్ క్లీనర్‌ను కూర్చోబెట్టి, అతడి చిన్ననాటి కలను నెరవేర్చి, లక్షలాది మంది నెటిజన్ల మనసులను గెలుచుకున్నారు. ఈ అద్భుత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే, రాకేష్ కుమార్ రోజూ జిమ్‌కు వెళ్లేటప్పుడు అక్కడ పనిచేసే ఓ క్లీనర్ తన లంబోర్ఘిని కారును ఎంతో ఆరాధనగా చూడటాన్ని గమనించేవారు. ఒక రోజు, ఆ క్లీనర్ ఫ్లోర్ శుభ్రం చేస్తూ కారును చూసి మొబైల్‌తో ఫోటో తీసుకున్నాడు. ఇది చూసిన రాకేష్ కుమార్, అతడి దగ్గరకు వెళ్లి, ఆత్మీయంగా చేయి కలిపారు. అనంతరం, తన కారు తాళాలు అతడి చేతికిచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోమని చెప్పారు. ఆ క్షణంలో ఆ క్లీనర్ కళ్లలో కనిపించిన ఆశ్చర్యం, ఆనందం వర్ణనాతీతమని రాకేష్ కుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ కుమార్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను కూడా నెలకు కేవలం రూ. 800 జీతంతో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసేవాడినని, సూపర్ కార్లను ఆరాధనగా చూసేవాడినని తెలిపారు. అప్పుడు చాలామంది యజమానులు తనను పట్టించుకునేవారు కాదని, భవిష్యత్తులో తాను అలాంటి కారు కొంటే ఎప్పుడూ అలా ప్రవర్తించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “గౌరవానికి అయ్యే ఖర్చేమీ లేదు. ఒక కరచాలనానికి కూడా ఏమీ ఖర్చు కాదు. కొన్నిసార్లు మనం ఒకరికి ఇచ్చే అతిపెద్ద బహుమతి డబ్బు కాదు, వారి కల కూడా సాధ్యమవుతుందనే నమ్మకం” అని ఆయన అన్నారు. “పెద్ద కలలు కనండి. మీ వంతు వస్తుంది” అనే సందేశంతో ముగించారు. రాకేష్ కుమార్ వినయాన్ని, మానవత్వాన్ని పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి జైలుపాలయ్యారు.. కారణం తెలుసా!
రూట్ మార్చిన జహీరాబాద్ రైతులు.. ఆలు సాగుకు గుడ్‌బై!
ఎల్ నినో ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన రైతుల కష్టాలు
చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ముప్పు! సముద్రాల్లో రికార్డు స్థాయి వేడి.. తీవ్ర కరవు, వరదల ప్రమాదం!
