స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. విమానంలో పొగతాగితే ఎంత డేంజరో అందరికీ తెలుసు.. అయితే విమానంలో చక్కగా సిగరెట్ తాగుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఓ ప్రబుద్దుడు. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన స్పైస్‌జెట్ విమానంలో హర్యానాకు చెందిన బాడీ బిల్డర్, సోషల్ మీడియా ఫేమ్ బల్వీందర్ కటారియా అనే వ్యక్తి ఆ పనిచేసినట్టు గుర్తించారు. ఈ ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. విమానంలో ప్రయాణికుడు సిగరెట్ తాగిన వైనంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు ఇప్పటికే ఈ విషయంలో చర్యలు తీసుకున్నట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. ఇలాంటి ఘటనలను క్షమించే ప్రసక్తే లేదని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా స్పష్టం చేశారు. విమానంలో పొగతాగిన బల్వీందర్ కటారియా 15 రోజుల పాటు విమానంలో ప్రయాణించకుండా బ్యాన్ చేసినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. మరిన్ని ట్రెండింగ్ కథనాలు చదవండి