హలీం ధరకు రెక్కలు..సింగిల్‌ ప్లేట్‌ ఏకంగా..

Updated on: Feb 22, 2026 | 4:30 PM

రంజాన్ మాసం వచ్చిందంటే చాలు.. భాగ్యనగర వీధులన్నీ హలీం సువాసనలతో నిండిపోతాయి. కానీ, ఈ ఏడాది ఆ రుచిని ఆస్వాదించాలంటే సామాన్యుడి జేబుకు చిల్లు పడాల్సిందే. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన వేళ, నగరంలో హలీం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఈ పోషకాహారం, ఇప్పుడు 'లగ్జరీ' వంటకంగా మారిపోతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లలో సింగిల్ ప్లేట్ హలీం ధర రూ.350 నుంచి రూ. 500 వరకు పలుకుతోంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి హలీం తినాలంటే కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. “పిల్లలు ఎంతో ఇష్టంగా అడుగుతారు.. కానీ ఈ ధరలు చూస్తుంటే కొనే ధైర్యం సరిపోవడం లేదు” అని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ధరల పెరుగుదలపై వ్యాపారస్తులను అడిగితే వారు తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, గోధుమ రవ్వ ధరలు భారీగా పెరిగాయని అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ నుండి పొట్టేళ్లను తీసుకురావడానికి ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి.కేవలం ఈ ఒక్క నెలలోనే భారీగా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాల్సి ఉంటుందని, నష్టపోకుండా ఉండాలంటే ధరలు పెంచక తప్పడం లేదని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా, ఏడాదికోసారి వచ్చే ఈ కమ్మని వంటకం ధరల భారంతో పేదవారికి అందనంత ఎత్తుకు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం :

తొందరేంటి.. కనీసం చెప్పేవరకు ఆగరా..?

ఎర్ర బటన్, పచ్చ బటన్ ఐబొమ్మ రవి పరిస్థితి ఇదే!

టీజర్ లాంఛ్ లో విశ్వక్ సేన్ క్రేజీ కామెంట్స్

క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us