సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..

Updated on: Apr 03, 2026 | 4:54 PM

గుజరాత్‌లోని అఘర్ గ్రామంలో ఒక కొండముచ్చు స్మార్ట్‌ఫోన్ లాక్కొని సెల్ఫీలు దిగుతూ వైరల్‌గా మారింది. మహిళ చేతి నుండి ఫోన్ లాక్కున్న వానరం, ఇంటిపైకి ఎక్కి ఎక్స్‌పర్ట్‌లా ఫోన్ స్క్రీన్‌ను పరీక్షించింది. కెమెరా ముందు రకరకాల ఫోజులిచ్చింది. ఇతర వానరాలకు అవకాశం ఇవ్వకుండా, మొబైల్ వాడటంలో మునిగిపోయింది. ఈ దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

సోషల్ మీడియా యుగంలో సెల్ఫీ క్రేజ్ మనుషులకే కాదు, వానరాలకూ పాకినట్లుంది! గుజరాత్‌లోని పటాన్ జిల్లా అఘర్ గ్రామంలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఓ కొండముచ్చు మొబైల్‌ ఫోన్‌ పట్టుకొని సెల్ఫీలు దిగుతూ తెగ ఫోజులిచ్చింది. తోటి వానరాలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా స్మార్ట్‌ఫోన్‌ చూడ్డంలో మునిగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియానే షేక్‌ చేస్తుంది. అఘర్‌ గ్రామానికి చెందిన ఒక మహిళ తన ఇంటి ముందు మొబైల్ ఫోన్ పట్టుకుని నిలబడి ఉంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, కొంముచ్చుల గుంపు అక్కడికి చేరుకుంది. అందులో ఓ వానరం మెరుపు వేగంతో దూసుకొచ్చి ఆ మహిళ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయింది. ఆ ఫోను పట్టుకుని నేరుగా ఓ ఇంటిపైకి ఎక్కి కూర్చుంది. మిగతా వానరాలన్నీ దానిని అనుసరించాయి. ఇక ఫోన్‌ చేతిలో పట్టుకొని ఆ వానరం చేసిన చేష్టలకు స్థానికులు కడుపుబ్బ నవ్వుకున్నారు. ఫోన్ పట్టుకున్న ఆ కొండముచ్చు, తీరిగ్గా ఒక పక్కన కూర్చుని దాని స్క్రీన్‌ను పరీక్షించడం మొదలుపెట్టింది. అచ్చు స్మార్ట్‌ఫోన్ వాడటంలో ఎక్స్‌పర్ట్‌లా మొబైల్ చూడ్డంలో మునిగిపోయింది. అంతటితో ఆగకుండా, ఫోన్ కెమెరా ముందు సెల్ఫీలు దిగుతున్నట్లుగా రకరకాల ఫోజులివ్వడం విశేషం. ఇదంతా చూసిన మిగతా వానరాలు ‘అన్ని సెల్ఫీలూ నువ్వే దిగుతావా.. మాకు కూడా ఇవ్వు ’అన్నట్టుగా ఆ ఫోను లాక్కోడానికి పోటీపడ్డాయి. అయితే ఈ వానరం మాత్రం ‘కష్టపడి నేను లాక్కొచ్చిన ఫోను.. మీకెందుకిస్తాను పొండి’ అన్నట్టుగా ఆ వానరాలను బెదిరించింది కూడా. పాపం ఆ వానరాలు మాకూ ఓ ఫోటో తీయొచ్చుకదా అన్నట్టుగా అక్కడే కూర్చుని దీనంగా చూస్తుండిపోయాయి. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగమంతా తన కెమెరాలో బంధించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. “ఈ రోజుల్లో కోతులకు కూడా టెక్నాలజీ తెలిసిపోయింది”, “నెక్స్ట్ జనరేషన్ కోతులు రీల్స్ కూడా చేస్తాయేమో!” అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో.. మళ్లీ కరోనా !! దేశానికి మరోసారి కొవిడ్ ముప్పు

పట్టపగలే ఆకాశంలో చీకట్లు.. భయపెట్టిన కాకుల గుంపు.. వినాశనానికి సంకేతమా

ఇంటి బాధ్యత నాపైనే ఉంది.. నేను చదువుకోవాలి సార్‌

జాబిల్లి చెంతకు ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములతో పాటు చిన్నారి ‘బొమ్మ’

ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి

Follow Us