పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌.. పాపం వీడి గొయ్యి వీడే తీసుకున్నాడు

Updated on: Apr 02, 2025 | 3:13 PM

ప్రస్తుత కాలంలో వివాహాలు ఎందుకు జరుగుతున్నాయో అర్ధం కాని పరిస్థితి. ఒకరితో ప్రేమాయణం.. మరొకరితో వివాహం.. పాత పరిచయాలతో కట్టుకున్నవారిని కడతేర్చడం సాధారణమైపోయింది. వివాహ బంధం నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. రాను రాను వీటికి విలువ లేకుండా పోతోంది.

ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. రిలేషన్‌ ఇంకొకరితో ఇలా మానవ సంబంధాలు భ్రష్టుపట్టిపోతున్నాయనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ప్రబుద్ధుడి గుట్టు రట్టుచేసింది కాన్ఫ్‌రెన్స్‌ కాల్. సెల్‌ఫోన్‌ కాన్ఫరెన్సు కాల్‌ ఓ మోసగాడి బారి నుంచి యువతి జీవితాన్ని కాపాడింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో ఓ రోజు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి అతడికి ఫోన్‌ చేసింది. అప్పటికే అతడు మరో యువతితో ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి ఈ కాల్‌ లిఫ్ట్‌ చేసి బైక్‌పై ఉన్నానని, మళ్లీ కాల్‌ చేస్తానంటూ పెళ్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. వైరల్‌ అవుతున్న ఫోటో

ఆ కోడి కబాబ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

బ్రతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు.. నేనున్నా అంటూ ప్రాణం పోసిన ‘ఏఐ’