Girl fights Robber: చిచ్చరపిడుగు..తల్లి కోసం దొంగతో వీరోచితంగా పోరాడిన చిన్నారి.. వైరల్‌ అవుతున్న వీడియో..

Updated on: Dec 02, 2021 | 9:54 AM

తొమ్మిదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి కిరాణా షాపుకు వెళ్లింది. ఈ క్రమంలో సరుకులు తీసుకోని షాపు నుంచి బయటకు రాగానే.. ఆమె తల్లి దగ్గరున్న పర్సును దొంగలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి అతనిపై తిరగబడింది.


తొమ్మిదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి కిరాణా షాపుకు వెళ్లింది. ఈ క్రమంలో సరుకులు తీసుకోని షాపు నుంచి బయటకు రాగానే.. ఆమె తల్లి దగ్గరున్న పర్సును దొంగలించేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడు. దీంతో ఆ చిన్నారి అతనిపై తిరగబడింది. దుండగుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. చిన్నారి ధాటికి ఆ దొంగోడు అక్కడినుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో. ఆ చిన్నారిపై నెటిజన్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

చిన్నారి విరోచితంగా దొంగతో పోరాడి తల్లిని రక్షించిందంటూ పోలీసు అధికారులు సన్మానించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. నవంబర్ 2న ఈ ఘటన జరిగినట్లు వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు తెలిపారు. జర్నీ నెల్సన్ ఆమె తల్లి డేనియల్ మోబ్లీ కిరాణా సామాన్లు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లారు. షాపింగ్ అనంతరం వారు బయట పార్క్ చేసిన కారు దగ్గరకు వెళ్లగా… అక్కడే మాటు వేసిన ఓ దుండగుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె తల్లి పర్సు దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఆమెను బలవంతంగా కిందపడేసి పర్స్‌ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తొమ్మిదేళ్ల జర్నీ నెల్సన్ ఆ దుండగుడిని అడ్డుకుంది. వెంటనే నిందితుడిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడటంతో.. అతను అక్కడి నుంచి పరారయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ధైర్యవంతురాలైన బాలికను వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు సన్మానం చేశారు. అనంతరం రెండురోజుల తర్వాత నిందితుడిని డిమెట్రియస్ జాక్సన్‌గా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జర్నీ ధైర్యసాహసాలకు పోలీసు శాఖ పతకం, సర్టిఫికేట్‌తో సత్కరించింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us