Mushroom: వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??

Updated on: Apr 16, 2026 | 4:02 PM

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జీవన్ కుమార్ ఇంటి పెరటిలో ఒక భారీ పుట్టగొడుగు మొలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. గొడుగుంత పెద్దదైన ఈ పుట్టగొడుగు వార్త వైరల్‌గా మారింది. ఇటీవల కురిసిన వర్షాలు, నేలలోని తేమ దీనికి కారణం కాగా, ఇది ప్రకృతి వింతనా లేక వాతావరణ మార్పుల ఫలితమా అనే చర్చ నడుస్తోంది.

ప్రకృతిలో అప్పుడప్పుడు వింతఘటనలు చోటుచేసుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి ఘటనే పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మనం చూసే పుట్టగొడుగులు చిన్నవిగా ఉంటాయి.. కానీ ఇక్కడ ఒక పుట్టగొడుగు మాత్రం భారీ సైజులో పెరిగి అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. గ్రామానికి చెందిన పి. జీవన్ కుమార్ అనే వ్యక్తి ఇంటి పెరటిలో ఓ పుట్టగొడుగు మొలిచింది. మొదట్లో అందరూ దానిని సాధారణ పుట్టగొడుగుగానే భావించి లైట్‌ తీసుకున్నారు. కానీ అది రోజు రోజుకూ పెరిగి పెద్దదవుతూ మనం వర్షం వచ్చినప్పుడు వేసుకునే గొడుగంత పెరిగింది. దీంతో ఆపుట్టగొడుగును చూసిన జీవన్‌కుమార్‌ కుటుంబ సభ్యులేకాదు, చుట్టుపక్కలవాళ్లు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ భారీ పుట్టగొడుగు వార్త దావానంలా వ్యాపించడంతో, దీనిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు. ఇంత పెద్ద పుట్టగొడుగును తాము ఎప్పుడూ చూడలేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. వచ్చిన వారంతా తమ మొబైల్ ఫోన్లలో దీనిని ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇటీవల కురిసిన వరుస వర్షాలు, నేలలోని అధిక తేమ వల్లే ఇలాంటి భారీ పుట్టగొడుగులు మొలుస్తాయని భావిస్తున్నారు. ఇది కేవలం ప్రకృతి అద్భుతమా లేక వాతావరణ మార్పుల ఫలితమా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా, గుమ్మలక్ష్మీపురంలో వెలిసిన ఈ ‘జెయింట్ మష్రూమ్’ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్‌ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు

వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా

చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్‌గా ఊయలెక్కి ఊగితే..

కోడిపుంజు వింత అరుపులు.. ఏం జరిగిందా అని చూడగా.. షాకింగ్‌ సీన్‌

ఇదేందయ్యా ఇదీ.. వధువు ఒక్కరే.. వరులు మాత్రం ఇద్దరా !!

Follow Us