Ghosts in Heroine House: ప్రముఖ నటి ఇంట్లో దెయ్యాలు..! నిజమేనట..! స్వయంగా ఆవిడా మాటల్లోనే వినండి..(వీడియో)
ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయక్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది..హాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత. నటనలో, గాయనిగా, కళా సాహిత్యాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటి. అలాంటి స్టార్ హీరోయిన్...
ప్రముఖ హాలీవుడ్ నటి సల్మా హాయక్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది..హాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత. నటనలో, గాయనిగా, కళా సాహిత్యాన్ని ప్రదర్శించడంలో తనకు తానే సాటి. అలాంటి స్టార్ హీరోయిన్…చాలా ఏళ్ల పాటు దెయ్యాలతో కలిసి జీవించిందట..చివరకు ఓ రోజు మంత్రగాడి సాయంతో దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని వివరించింది..సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోం.. కానీ ఏకంగా హాలీవుడ్ నటే ఇలా చెప్పటంతో…విషయం కాస్త టాపిక్‌గా మారింది.
లండన్‌లో ఉన్న తన ఇంట్లో చిత్ర, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకునేవని సల్మా హాయక్ చెప్పారు. పియానో దానంతట అదే మోగేది. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవి. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయాను. మనుషులు ఎవరు కనిపించే వారు కారు. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని అర్థం చేసుకున్నానని చెప్పింది.. కాకపోతే తానేప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదని చెప్పారు.
నాకు మా ఇంట్లో ఎప్పుడు దెయ్యం కనిపించలేదు. కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవి. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చాను. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నా ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి మాత్రం మిగిలింది…. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటున్నాను. ఇక నేను తీసుకువచ్చిన వ్యక్తి దగ్గర దగ్గర 20 దెయ్యాలను పట్టుకున్నట్లు చెప్పాడని హాయక్ వివరించారు. ఏది ఏమైనా ఓ హీరోయినే స్వయంగా దెయ్యాలు ఉన్నాయని చెప్పటం మాత్రం సంచలనం రేపుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..