Ghost: బాబోయ్‌.. డిఈవో ఆఫీసులో దెయ్యం.! రాత్రుళ్లు ఆఫీసు రూమ్‌నుంచి వింత శబ్దాలు.

|

Oct 30, 2023 | 8:02 AM

ఇటీవల దెయ్యాలు బాగా పాపులర్‌ అయిపోతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌ నగరంలోనే ఓ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ యూట్యూబర్స్‌ తమ ఛానెళ్లలో హోరెత్తించారు. ఈ ఘటన మరువకముందే ఇప్పడు ఆదిలాబాద్‌ జిల్లాలోని డీఈవో ఆఫీసులో దెయ్యం సంచరిస్తోందనే వార్త సంచలనం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత డీఈవో ఆఫీసురూమ్‌నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాయట.

ఇటీవల దెయ్యాలు బాగా పాపులర్‌ అయిపోతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌ నగరంలోనే ఓ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ యూట్యూబర్స్‌ తమ ఛానెళ్లలో హోరెత్తించారు. ఈ ఘటన మరువకముందే ఇప్పడు ఆదిలాబాద్‌ జిల్లాలోని డీఈవో ఆఫీసులో దెయ్యం సంచరిస్తోందనే వార్త సంచలనం రేపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత డీఈవో ఆఫీసురూమ్‌నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నాయట. అంతేనా.. అక్కడి సిబ్బందికి అప్పుడప్పుడూ వింత ఆకారాలు కూడా కనిపిస్తున్నాయట. దాంతో అటువైపు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నడిబొడ్డున వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో డీఈవో కార్యాలయం ఉంది. ఈకార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రాంతం ఉండటం గతంలో ఆ ప్రాంతంలో ఓ హత్య జరగడం.. అలా చనిపోయిన వ్యక్తి ఆత్మే ఇలా సంచరిస్తుందన్న ప్రచారం కూడా ఉంది. దాంతో డీఈవో కార్యాలయ సిబ్బంది ఆఫీసుకు వెళ్లాలంటే వణుకుతున్నారు. తాజాగా ఓపెన్ స్కూల్ పరీక్షల జవాబుపత్రాలు ఈ డీఈవో ఆఫీసులో భద్రపరిచారు. అక్కడ సెక్యూరిటీగా ముగ్గురు ఏఆర్‌ కానిస్టేబుళ్లను నియమించారు. నైట్ డ్యూటీకి వచ్చిన ఓ కానిస్టేబుల్ కు డీఈవో కార్యాలయంలోని ఓ రూం నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని వెళ్లిచూసిన అతనికి ఏమీ కనిపించకపోవడంతో అక్కడే వాచ్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తిని విషయం ఏమిటని అడిగాడు. కొంతకాలంగా ఇక్కడ అలా శబ్దాలు వినిపిస్తున్నాయని, అందుకు కారణం దెయ్యమేనని చెప్పడంతో కానిస్టేబుల్‌ కాస్త భయపడ్డాడు. అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఎందుకైనా మంచిదని ఓ భూతవైద్యుడిని తీసుకొచ్చి చూపించాడు. అతను కూడా అక్కడ దెయ్యం ఉందని చెప్పడంతో ఈ వార్త దావానలంలా పాకిపోయింది. ఇక జనాలు భయంతో అటుపక్క వెళ్లడమే మానేశారు. దాంతో డిఈవో రంగంలోకి దిగారు. ఉద్యోగులు, స్థానికుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు జన విజ్ఞాన వేదిక సభ్యులను కార్యాలయానికి రప్పించి.. రాత్రంతా అదే రూంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. వారంతా ధైర్యంగా అక్కడ బసచేసి దెయ్యం లేదని నిరూపించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే రాత్రి డీఈవో కార్యాలయంలోని మహిళల బాత్రూంలో మరుగుదొడ్డి పగిలి పోవడంతో ఆ భయం మళ్లీ మొదలైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..