పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
కొందరు యువతీయువకులు వాహనాల్లో రాత్రి వేళ్ల అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అంతా కలిసి డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. యువతులు గెస్ట్ హౌస్‌లో డాన్సు చేస్తుండగా.. యువకులంతా కలిసి వాహనంలో అడవి మధ్యలో రోడ్డుపైకి వచ్చేశారు. అక్కడ డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. అలా అంతా సరదాగా ఉండగా.. సడెన్‌గా షాకింగ్ ఘటన జరిగింది.
ఓ సింహం రోడ్డు దాటడం చూసి అంతా షాక్ అయ్యారు. అంతా కలిసి భయంతో కారులోకి ఎక్కేశారు. సింహం దూరంగా రోడ్డు దాటి వెళ్లిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అబ్బాయిలకు అమ్మాయిలతో తప్ప.. సింహాలతో సమస్య లేదు’.. అంటూ కొందరు, ‘పెద్ద ప్రమాదం తృటిలో తప్పిపోయిందిగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.43 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యువత వేడుక చేసుకునే తీరు మారింది. పుట్టినరోజు వచ్చిందంటే.. రోడ్డుపై వాహనాలు ఆపడం, అక్కడే కేకులు కట్ చేసి రచ్చ రచ్చ చేయడం చూస్తుంటాం. మరికొందరు నైట్ క్యాంపింగ్ పేరుతో అడవులలోకి వెళుతున్నారు. కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయాల్లో పరిసరాల్లో ఏం జరుగుతోందో ఓ కన్నేసి ఉంచాలి. అలర్ట్‌గా ఉండటం కూడా ఎంతో ముఖ్యం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు టికెట్ లేని వారి నుంచి ఒక్క రోజే రూ.కోటి వసూలు
చైనా పైసల కోసం గాడిదలు పెంచుతున్న పాక్
నీతా అంబానీ బ్యాగ్ ఖరీదెంతో తెలుసా ??
ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి
చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం
