flight attendant: అతనో ఫ్లైట్ అటెండెంట్.. నడక, నడత కాస్త తేడాగా ఉంది.. అధికారులు ఆపి చెక్ చేయగా..

|

Jun 02, 2022 | 9:29 AM

నిఘా పెంచినప్పటికీ విమానాశ్రయాల ద్వారా బంగారం స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. రకరకాల మార్గాల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ.. ఒక ఫ్లైట్ అటెండెంట్..


నిఘా పెంచినప్పటికీ విమానాశ్రయాల ద్వారా బంగారం స్మగ్లింగ్ నిరాటంకంగా కొనసాగుతోంది. రకరకాల మార్గాల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ.. ఒక ఫ్లైట్ అటెండెంట్.. కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో… అధికారులకు చిక్కాడు. అతను గతంలో 6 సార్లు ఇలా గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ క్యాబిన్ క్రూలో పనిచేసే నవనీత్ సింగ్‌గా గుర్తించారు. 4.5 కోట్ల విలువ చేసే 1.25 కేజీల బంగారాన్ని అతను బూట్లలో దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని విమానంలోని వాష్‌రూమ్‌లో పెడుతుంది. దానిని బూట్లలో దాచిపెట్టి అధికారులకు చిక్కకుండా బయటకు తేవడం నవనీత్ పని. ఇలా చేసినందుకు ప్రతిసారీ తనకు 3 లక్షలు ఇచ్చినట్లు నవనీత్ అంగీకరించాడు. దీని వెనుక మలప్పురానికి చెందిన బంగారం స్మగ్లింగ్ ముఠా హస్తం ఉందని వెల్లడించాడు. కాగా.. రెండు నెలల క్రితమే బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు విమాన సిబ్బందిని కరిపూర్‌లోని కాలికట్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on