Mumbai: లోకల్ ట్రైన్‌లో పుట్ బోర్డ్‌పై ఫైట్..! కిటికీ పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి.
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ ట్రైన్స్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలకెక్కుతూనే ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ఈ ట్రైన్స్‌లో రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇక ముంబై లోకల్ ట్రైన్ విషయానికి వస్తే ఇందులో ప్రయాణమంటే నిల్చోడానికి కాస్త చోటు కోసం కూడా కుస్తీ పట్టాల్సిందే.
ఢిల్లీ మెట్రో- ముంబై లోకల్ ట్రైన్స్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలకెక్కుతూనే ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు యువత ఈ ట్రైన్స్‌లో రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇక ముంబై లోకల్ ట్రైన్ విషయానికి వస్తే ఇందులో ప్రయాణమంటే నిల్చోడానికి కాస్త చోటు కోసం కూడా కుస్తీ పట్టాల్సిందే. తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది ముంబై లోకల్ ట్రైన్‌లో. వేగంగా వెళుతున్న రైలులో డోరు దగ్గర నిలుచున్న ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం రాజుకొంది. అది ఎంతవరకూ దారితీసిందంటే ఓ వ్యక్తి మరో వ్యక్తిని రైల్లోంచి కిందకు తోసేసే ప్రయత్నం చేశాడు. ముంబై మేటర్స్ పేరుతో ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరు ప్రయాణికులు రైలు డోర్ దగ్గర నిలుచుని ఉన్నారు. వారిద్దరూ ఏదో విషయమై గొడవపడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి తన ఎదురుగా ఉన్న వ్యక్తి గొంతుపట్టి అతనిని రైలు నుంచి బయటకు నెట్టిసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ట్రైన్ గ్రిల్ గట్టిగా పట్టుకుని తనను తాను కాపాడుకోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీనిని చూసిన రైలులోని తోటి ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. వీరి కారణంగా డోర్ వద్ద నిల్చున్న మరో వ్యక్తి కూడా ప్రాణాపాయంలో పడేవాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ముంబై మెట్రోలో ఇది నిత్యకృత్యమై పోయిందని ఒకరు కామెంట్ చేయగా, చిన్న విషయానికి ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ ప్రశ్నించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..