Father’s Love: నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ తండ్రి ప్రేమ.. బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు..

|

Jun 05, 2022 | 10:00 AM

ఇంటర్నెట్ లో.. ప్రతిరోజూ ఏదో ఒక ఫోటో లేదా ఏదో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తూ.. చర్చలో నిలుస్తుంది. వాటిలో కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది.


ఇంటర్నెట్ లో.. ప్రతిరోజూ ఏదో ఒక ఫోటో లేదా ఏదో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తూ.. చర్చలో నిలుస్తుంది. వాటిలో కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. ఈ ఫోటో చూసి నెటిజన్లు తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అద్భుతం ఆ సమయం అంటూ ఎమోషనల్‌ కామెంట్లు పెడుతున్నారు.వైరల్ అవుతున్న ఈఫోటోలో.. ఒక వ్యక్తి తన మోటార్‌సైకిల్‌పై పెద్ద ప్లాస్టిక్ బొమ్మను తీసుకుని వెళ్తున్నాడు. ఈ చిత్రాన్ని చూస్తుంటే .. అది తన బిడ్డ కోసం అతను ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ బొమ్మను తన బిడ్డకు ఇవ్వగానే తన కళ్లలో ఆనందం చూడాలని ఆ తండ్రి కూడా చాలా ఆసక్తిగా ఉండి ఉంటాడు అనిపిస్తోంది. ఈ ఫొటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటోని షేర్ చేస్తూ.. “ఈ రాత్రి ఎవరూ సంతోషంతో నిద్రపోలేరు” అనే క్యాప్షన్ కూడా జతచేశారు. ఈ ఫోటో వేలాది మందిని ఆకట్టుకుంది. దాదాపు లక్షమంది లైక్ చేశారు అంటే.. ఆ చిత్రం ఎంతగా కదిలించిందో తెలుస్తోంది. పేదరికంలో ఉన్న ఏకైక గొప్ప విషయం ఏమిటంటే.. చిన్న విషయాలు కూడా మన ఆనందాన్ని పెంచుతాయి. ఈ ఫోటోతో మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అని ఒకరు.. తండ్రి వెంటే.. పిల్లల కలలన్నీ ఉన్నాయి.. తండ్రి ఉంటే, మార్కెట్లో ఉన్న బొమ్మలన్నీ వారివే ‘ అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు. తండ్రి ప్రేమ ఎప్పుడూ గొప్పదే అని సంతోషన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us on