కేరళ ఏనుగు పిల్ల ‘మాయ’కు వంతారా ఊపిరి.. మానవత్వం చాటుకున్న అనంత్‌ అంబానీ సంస్థ

Updated on: Nov 11, 2026 | 7:27 PM

కేరళకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగు పిల్ల మాయకు చికిత్స అందించేందుకు అనంత్ అంబానీకి చెందిన వంతారా ముందుకొచ్చింది. నవంబర్ 5న ప్రత్యేక ఫ్లయింగ్ ఐసీయూ విమానంలో మాయను గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు తరలించారు. ప్రస్తుతం 24 గంటల వైద్య పర్యవేక్షణలో హైడ్రోథెరపీ, నొప్పి నివారణ చికిత్సలు అందిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అభయారణ్యానికి చేర్చేందుకు వంతారా సహకరించనుంది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేరళకు చెందిన ‘మాయ’ అనే ఏనుగు పిల్లకు ప్రాణం పోసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’ జంతు సంరక్షణ సంస్థ ముందుకొచ్చింది. డాక్టర్ కుశాల్ కొంవర్ శర్మ.. మాయ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి పారాథైరాయిడ్ సంబంధిత సమస్య ఉండవచ్చని, సరైన వైద్యంతో నయం చేయవచ్చని గుర్తించడంతో మాయ కోలుకోవడంపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన వంతారా నిపుణుల వైద్య బృందం.. మాయకు సంబంధించిన వైద్య నివేదికలు, ఎక్స్‌రేలు, రక్త పరీక్షల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం కేరళ రాష్ట్ర మెడికల్ బోర్డుతో చర్చలు జరిపి, నవంబర్ 5న అత్యంత ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన ‘ఫ్లయింగ్ ఐసీయూ’ విమానంలో మాయను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని వంతారా కేంద్రానికి సురక్షితంగా తరలించారు. ఈ విమాన ప్రయాణంలో నిరంతర పర్యవేక్షణ కోసం అనుభవజ్ఞులైన ఏనుగుల వైద్యులు, పారావెట్స్, సంరక్షకులతో పాటు అత్యవసర మందులు, లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం వంతారా కేంద్రంలో మాయకు 24 గంటల పాటు నిరంతర వైద్య పర్యవేక్షణ, నొప్పి నివారణ చికిత్సలు, అధునాతన పరీక్షలు అందిస్తున్నారు. ఆ ఏనుగుపిల్ల వేగంగా కోలుకోవడానికి హైడ్రాలిక్ లిఫ్టింగ్ సదుపాయాలు, హైడ్రోథెరపీ ద్వారా ప్రత్యేక వైద్య చికిత్సలు జరుపుతున్నారు. ఈ మొత్తం వైద్య విధానం కేరళ ప్రభుత్వ కమిటీ ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతోంది. చికిత్స పూర్తయి మాయ పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి అభయారణ్యానికి చేర్చేందుకు వంతారా పూర్తి సహకారం అందించనుంది. కేరళలో పెరిగిన ఈ ఏనుగు పిల్లకు వంతారాలో అందుతున్న ఈ ప్రత్యేక వైద్యం కొత్త జీవితంపై బలమైన నమ్మకాన్ని కలిగిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్‌క్లోజర్ కింద సొరంగం తవ్వి మరీ పారిపోయిన పులి

హాట్ టాపిక్‌గా.. అనిరుధ్ – కావ్యమారన్‌ పెళ్లి సందడి

చిరిగిన రూ.20 నోటు.. కస్టమర్‌ను కొట్టి చంపిన సిబ్బంది! ఇంత అన్యాయమా?

మతిపోయే కాన్సెప్ట్.. జక్కన్న ఊహ వేరే లెవల్‌..వారణాసి సినిమా స్టోరీ లీక్

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమలకు వెళ్లే రైళ్లు రద్దు..

Loading...
Unable to load recommendations.
Follow Us