అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!
కెనడాలోని ఒంటారియోకు చెందిన ట్రాంగ్ ఫామ్‌కు అరుదైన అదృష్టం కలిసి వచ్చింది. వారం రోజుల వ్యవధిలో రెండు లాటరీ జాక్‌పాట్‌లను గెలుచుకుని కోట్లాది రూపాయలను సొంతం చేసుకుంది. సహోద్యోగులతో కలిసి కొన్న టికెట్‌కు రూ.407 కోట్ల బంపర్ ప్రైజ్ రాగా, అనంతరం కొనుగోలు చేసిన స్క్రాచ్ కార్డ్‌తో మరో రూ.1.6 కోట్ల బహుమతి గెలిచి వార్తల్లో నిలిచింది.
అదృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే గొప్ప విషయం అయితే కెనడాకు చెందిన ఓ మహిళ విషయంలో అదృష్టం వరుసగా రెండుసార్లు తలుపు తట్టింది. కేవలం వారం వ్యవధిలో రెండు లాటరీ జాక్‌పాట్‌లను గెలుచుకుని కోట్లాది రూపాయలను సొంతం చేసుకుని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెనడాలోని ఒంటారియోకు చెందిన ట్రాంగ్ ఫామ్ కు ఈ అసాధారణ అదృష్టం దక్కింది. గతేడాది ఆమె తన ఆఫీసులోని నలుగురు సహోద్యోగులతో కలిసి ఒక లాటరీ టికెట్‌ను కొన్నారు. ఆ టికెట్‌కు ఏకంగా 60 మిలియన్ల కెనెడియన్ డాలర్లు రూ.407 కోట్లకు పైగా బంపర్ జాక్‌పాట్ తగిలింది. ఆ భారీ మొత్తాన్ని ట్రాంగ్ ఫామ్‌తో సహా ఆ ఐదుగురూ సమానంగా పంచుకున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఆమె స్క్రాచ్ కార్డ్ అనే మరో లాటరీని కొన్నారు. ఆశ్చర్యకరంగా దానికి కూడా జాక్‌పాట్ తగిలింది. ఆ లాటరీతో రూ.1.6 కోట్ల రూపాయలు వచ్చాయి. సాధారణంగా ఒక మనిషి జీవిత కాలంలో ఒక్కసారి లాటరీ తగలడమే అరుదైన విషయం. అలాంటిది వారంలో ఒకే వ్యక్తికి రెండుసార్లు భారీ మొత్తంలో జాక్‌పాట్లు రావడం కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Maa Inti Bangaram: రఫ్ఫాడించిన సమంత! హిట్టా..? ఫట్టా..?
Peddi: OTTలోకి ‘పెద్ది’ వచ్చేది.. ఎప్పుడంటే..?
Save The Tigers 3: మొగుళ్ల ఫ్రస్ట్రేషన్.. నవ్వుల జాతర! హిట్టా..? ఫట్టా..?
Vanda Devullu: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ‘వంద దేవుళ్లు’ రివ్యూ..
Honeymoon Tragedy: నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?
