Dog ownership: ప్లీజ్.. ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..! పార్టీలు మీకే కాదు మాకు కూడా.. మీ తుమ్మే మా గెలుపు.. (వీడియో)
రాజరిక పాలన గురించి తెలుసు, అధ్యక్ష పాలన గురించి తెలుసు, ప్రజాస్వామ్యం గురించి కూడా మనందరికీ తెలుసు. శునక స్వామ్యం గురించి తెలుసా మీకు? ఓటింగ్ మెజారిటీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మనుషులకు మాత్రమే అనుకున్నాం మనం ఇన్నాళ్లూ...
రాజరిక పాలన గురించి తెలుసు, అధ్యక్ష పాలన గురించి తెలుసు, ప్రజాస్వామ్యం గురించి కూడా మనందరికీ తెలుసు. శునక స్వామ్యం గురించి తెలుసా మీకు? ఓటింగ్ మెజారిటీ, ప్రజాస్వామ్యం ఇవన్నీ మనుషులకు మాత్రమే అనుకున్నాం మనం ఇన్నాళ్లూ… కానీ ఈ పద్ధతి కుక్కలు కూడా పాటిస్తాయట తెలుసా… ఆశ్చర్యంగా ఉంది కదూ.. కొత్తగా తెరపైకి వచ్చిన ఈ శునకస్వామ్యం గురించి తెలుసుకుందాం రండి…
అసలు కుక్కలకి మాటలే రావు.. ఇంకా వీటికో శునకస్వామ్యం కూడానా.. అనుకుంటున్నారు కదా.. ఆఫ్రికా అడవుల్లో ఉండే శునకాలకి ఓ భాష ఉంది.. అదే తుమ్ముల భాష. ఈ భాషలోనే మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయట. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయట. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు.. మెజారిటీ వచ్చేసినట్టేనట. అప్పుడు అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయట. అయితే మన రాజకీయాల్లో లాగా ప్రతిపక్ష నేతలకు ఎలా అయితే ప్రాధాన్యత ఉండదో.. అలాగే ఇక్కడ కూడా అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదట. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. అయితే ఈ శునక సమావేశంలో కోరం కూడా ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటాయట. ఇవన్నీ మన పరిశోధకులు అధ్యయనంచేసి వెల్లడించిన విషయాలు. శునకస్వామ్యమా.. మజాకా..! అన్నట్లుంది కదూ..!
మరిన్ని చూడండి ఇక్కడ : Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…