దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే
ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ వైద్యుడిపై సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. శస్త్రచికిత్స కోసం లంచం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదన్న కారణంతో, ఆపరేషన్ చేసి అతికించిన బాలిక కాలి ఎముకను మళ్లీ విరగ్గొట్టాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరో ఆసుపత్రిలో ఎక్స్‌రే తీయించగా ఎముక మళ్లీ విరిగినట్లు తేలడంతో ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు విచారణకు ఆదేశించారు.
‘వైద్యో నారాయణో హరి’ అంటారు.. అంటే ప్రాణం పోసే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రభుత్వ వైద్యుడు పవిత్రమైన వృత్తిలో ఉంటూ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. లంచం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదన్న కక్షతో, తాను ఆపరేషన్ చేసి అతికించిన ఒక చిన్నారి కాలి ఎముకను తనే చేతులతో విరగ్గొట్టి రాక్షసానందం పొందాడు. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్‌కు చెందిన రేష్మ అనే నిరుపేద వితంతువుకు 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తె ఉంది. నెలన్నర క్రితం ఆ బాలిక ఎడమకాలి ఎముక విరగడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సర్జరీ కోసం ఆసుపత్రి సిబ్బంది రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పిన బాధితురాలు జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అధికారుల ఆదేశాల తర్వాత కూడా సిబ్బంది పట్టించుకోకపోవడంతో, రేష్మ అతికష్టంపై రూ.8 వేలు సర్దారు. దాంతో డాక్టర్ చతుర్వేది అనే వైద్యుడు బాలికకు సర్జరీ చేసి, మిగతా డబ్బులు తర్వాత ఇవ్వాలని కరాఖండీగా చెప్పాడు. అయితే, తదుపరి పరీక్షల సమయానికి రేష్మ మిగిలిన లంచం డబ్బులు తీసుకురాకపోవడంతో ఆ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలిక నడవగలుగుతుందో లేదో చూస్తానంటూ.. ఆ చిన్నారి కాలిని పట్టుకుని గట్టిగా మెలిపెట్టాడు. ఆ బాలిక నొప్పితో విలవిల్లాడుతూ అరుస్తున్నా వినకుండా కాలిని అటూఇటూ తిప్పాడు. ఇంటికొచ్చాక కూడా చిన్నారి నరకం చూడడంతో రేష్మ మరో ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించింది. అక్కడ వైద్యుడి దారుణం బయటపడింది. ఆపరేషన్ చేసి అతికించిన ఎముక మళ్లీ విరిగినట్లు రిపోర్టులో తేలింది. ఈ దారుణంపై బాధితులు ఆందోళనకు దిగడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐఆర్‌సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్
చెట్టుపైనుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి.. వానరం ఎంత పని చేసింది!
ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన
రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్ దొంగా ఛేజింగ్
90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!
