Tablets for Gas Problem: గ్యాస్‌ ట్రబుల్‌ కోసం ఎక్కువగా టాబ్లెట్లు వాడుతున్నారా అయితే ఈ వీడియో మీ కోసమే..

|

Sep 21, 2022 | 9:35 AM

మీకు గ్యాస్‌ ట్రబుల్‌ వస్తే ర్యాంటాక్‌ , జింటాక్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. క్యాన్సర్‌ వస్తుందన్న అనుమానంతో అత్యవసర జాబితా నుంచి ఈ మందులను కేంద్రం తొలగించింది.


మీకు గ్యాస్‌ ట్రబుల్‌ వస్తే ర్యాంటాక్‌ , జింటాక్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. క్యాన్సర్‌ వస్తుందన్న అనుమానంతో అత్యవసర జాబితా నుంచి ఈ మందులను కేంద్రం తొలగించింది. ఈ మందులతో క్యాన్సర్‌ వస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ర్యాంటాక్‌, జింటాక్‌ ట్యాబ్లెట్లతో పాటు మరో 26 మందులను అత్యవసర జాబితా నుంచి తొలగిస్తునట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్‌ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు.జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సెప్టెంబర్‌ 14న విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్‌ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎండోక్రైన్‌ మందులు, ఇన్సులిన్‌ గ్లార్గిన్‌, ఐవర్‌మెక్టిన్‌ వంటి 34 రకాల ఔషధాలను కొత్తగా జాబితాలో చేర్చారు. రనిటైడిన్‌, సక్రాల్‌ఫేట్‌, అటినోలాల్‌ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు. మందుల ధరలు, ఉత్తమ ఔషధాల లభ్యత తదితర కారణాలతో ఈ మందులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను మళ్లీ ఇప్పుడే అప్‌డేట్‌ చేశారు. 350 మందికి పైగా నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారుచేసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ప్రముఖ యాంటాసిడ్‌ సాల్ట్‌ అయిన రనిటైడిన్‌ ఔషధాన్ని దేశంలో అసిలాక్‌, జిన్‌టాక్‌, రాంటాక్‌ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్నారు. ఎసిడిటీ, కడుపునొప్పి సంబంధిత సమస్యలకు వైద్యులు ఈ మందులను ఎక్కువగా సూచిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడయ్యే ఔషధాల్లో ఇది ఒకటి. అయితే ఈ ఔషధంలో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని 2019లో అమెరికా పరిశోధన ఒకటి వెల్లడించింది. దీంతో అప్పటి నుంచి ఈ ఔషధ వినియోగంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్లే అత్యవసర ఔషధాల జాబితా నుంచి దీన్ని తొలగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on