Birthday Party Video: నటి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి… కొంచెమైతే ఏమయ్యేదో.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Updated on: Sep 26, 2021 | 9:03 PM

నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. కొంచెం అలర్ట్‌గా ఉన్నట్లయితే పెను ప్రమాదాలను కూడా తప్పించుకోవచ్చు. తాజాగా ఒక అమెరికాకు చెందిన నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి ప్రమాదమే జరిగింది.

నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరబాట్లు పెద్ద పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి. కొంచెం అలర్ట్‌గా ఉన్నట్లయితే పెను ప్రమాదాలను కూడా తప్పించుకోవచ్చు. తాజాగా ఒక అమెరికాకు చెందిన నటి పుట్టినరోజు వేడుకల్లో అటువంటి ప్రమాదమే జరిగింది. అయితే తృటిలో ఆమె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘ది సింపుల్‌ లైఫ్‌’ టెలివిజన్‌ సిరీస్‌లో నటించిన ప్రముఖ అమెరికన్‌ రియాలిటీ స్టార్‌ నికోల్‌ రిచీ తన 40వ పుట్టినరోజు వేడుకలను సెప్టెంబర్‌ 21న జరుపుకున్నారు. అయితే కేక్‌ కట్‌ చేసే ముందు క్యాండిల్స్‌ను నోటితో ఊది ఆర్పే టైంలో అనుకోకుండా ఆమె తలవెంట్రుకలకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఈ హఠాత్‌ పరిణామానికి భయపడిన ఆమో భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే తన చేతులతో ఆ మంటలను ఆర్పేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు నికోల్‌ రిచీ. దీనికి సంబంధించిన వీడియోను నికోస్‌ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘వెల్‌ సోఫార్‌ 40 ఈజ్‌ ’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. దీంతో హ్యాపీ బర్త్‌డే కుజ్‌, మీరు బాగున్నారా? అంటూ స్నేహితులు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు.

మరిన్ని చదవండి ఇక్కడ : Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)

 Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)

 Train Two Parts Video: రెండుగా విడిపోయిన రైలు బోగీలు..! కామారెడ్డిలో షాకింగ్..వైరల్ అవుతున్న వీడియో..

  Perni Nani-pawan kalyan: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన పేర్ని నాని..(లైవ్ వీడియో)

Loading...
Unable to load recommendations.
Follow Us