డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!

Updated on: Sep 23, 2022 | 9:02 AM

ఆన్‌లైన్ యుగం వచ్చాక అంతా మారిపోయింది.. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడపకు చేరుతున్నాయి.

ఆన్‌లైన్ యుగం వచ్చాక అంతా మారిపోయింది.. పెరిగిపోతున్న సాంకేతికతతో కావాల్సిన వస్తువులు నట్టింట్లోకి వచ్చేస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా అడుగు బయటపెట్టకుండా ఒక్క క్లిక్ తో ఇంటి గడపకు చేరుతున్నాయి. కష్టపడాల్సిన పని లేదు, చెమటలు కక్కాల్సిన అవసరం అంతకన్నా లేకుండా ఇంటికొచ్చి మరీ కావాలసిన వాటిని ఇచ్చే సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రకాల ఆప్‌లు హోమ్ డెలివరీతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా ఓ వైపు.. మరోవైపు ఆర్డర్ డెలివరీ చేసే బాయ్స్ పరిస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ?. ఎంత కష్టమొచ్చినా.. తమ విధి ధర్మాన్ని నెరవేరుస్తుంటారు.. ఎండైనా, వానైనా కస్టమర్లకు ఇబ్బంది రాకుండా.. సరైన సమయానికి ఆర్డర్ ను చేరువేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో డెలివరీ బాయ్ వర్క్ పై తనకున్న డెడికేషన్‌‌తో నెట్టింట హీరో అయిపోయాడు. కదులుతున్న రైలును సైతం చేజ్‌ చేసి ఓ కస్టమర్‌కు వస్తువును అందించాడు. వివిధ రకాల వస్తువులను హోమ్‌ డెలివరీ అందించే ఏజెంట్‌ రన్నింగ్‌ ట్రైన్ వెంట పరుగెత్తి మరీ కస్టమర్‌కు ఆర్డర్ డెలివరీ చేశాడు. కస్టమర్‌ వస్తువును అందుకోగానే భారీ విజయం సాధించినట్టుగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడికి ప్రమోషన్‌ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మమ్మా మజాకా.. తాతతో బైక్‌పై రయ్‌మంటూ దూసుకెళ్తోంది !!

Published on: Sep 23, 2022 09:02 AM
Loading...
Unable to load recommendations.
Follow Us