Dating Scam: అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లిన వ్యక్తికి షాక్.! ఇదో రకం స్కామ్ అంటూ పోస్ట్!
అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి షాక్ తగిలింది. రెస్టారంట్‌లో తనకెదురైన మోసాన్ని ఎక్స్‌లో బయటపెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో అర్చిత్ గుప్తా అనే వ్యక్తి బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయితో కలిసి రాజౌరీ గార్డెన్‌లోని బార్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఇలా రాసుకొచ్చాడు. తామిద్దరం కలిసి ఓ బార్‌కు వెళ్లామని 2-3 గ్గాసుల డ్రింక్స్, వైన్, వోడ్కా, చికెన్ టిక్కా, వాటర్ బాటల్ తీసుకున్నామని.
అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి షాక్ తగిలింది. రెస్టారంట్‌లో తనకెదురైన మోసాన్ని ఎక్స్‌లో బయటపెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీలో అర్చిత్ గుప్తా అనే వ్యక్తి బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ అమ్మాయితో కలిసి రాజౌరీ గార్డెన్‌లోని బార్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ జరిగింది ఇలా రాసుకొచ్చాడు. తామిద్దరం కలిసి ఓ బార్‌కు వెళ్లామని 2-3 గ్గాసుల డ్రింక్స్, వైన్, వోడ్కా, చికెన్ టిక్కా, వాటర్ బాటల్ తీసుకున్నామని. తీరా రూ.15,886 బిల్ చూసేసరికి షాక్ అయినట్లు తెలిపాడు. చేసేదేమీ లేక బిల్ కట్టి వాష్‌రూమ్‌కు వెళ్లాననీ తిరిగొచ్చే సరికి టేబుల్‌పైన బిల్లు లేదు అక్కడ ఆ అమ్మాయీ లేదనీ తనకేమీ అర్థం కాలేదనీ ఆ తర్వాత ఆమెకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదనీ రాసుకొచ్చాడు. తర్వాత యాప్‌లో వెతికితే ఆమె ఖాతా కనపడలేదనీ అప్పుడు అర్థం అయింది తాను మోసపోయానని అంటూ అర్చిత్ విషయాన్ని తెలిపాడు. ఈ క్లబ్‌లు, బార్‌లు అమ్మాయిల సాయంతో ఇలాంటి మోసాలు చేస్తున్నాయని అర్చిత్ గుప్తా పోస్ట్‌లో తెలిపాడు. తాను అర్డర్ చేసిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని చెల్లించానని తెలిపాడు. ఈ తరహా మోసాలు జరగడం ఇదేం మొదటి సారి కాదు. ఇలా డేటింగ్ యాప్‌ల మాటున అబ్బాయిలను పరిచయం చేసుకొని హోటళ్లకే తీసుకెళ్లి డబ్బులు దోచుకున్న సందర్భాలున్నాయి. సెప్టెంబరులోనే ఓ వ్యక్తి ఇలానే అమ్మాయితో కలసి హోటల్‌కు వెళ్లి రూ.14 వేల వరకు మోసపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.