Current Bill: ఇంట్లో రెండే బల్బులు.. కరెంట్ బిల్ మాత్రం రూ.1,05,032. వీడియో..
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. రాష్ట్రంలో సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి విద్యుత్ బిల్లులు. తాజాగా ఓ చిన్న పెంకుటింట్లో జీవించే సామాన్యుడికి వేలల్లో కరెంట్ బిల్లు రావడంతో లబోదిబోమంటున్నాడు. అతని ఇంట్లో కనీస అవసరాలైన ఫ్యాన్, ఫ్రిజ్, ఏసీ, ఏవీ లేవు. అయినా అతనికి వందల్లో రావాల్సిన కరెంట్ బిల్లు ఏకంగా వేలల్లో వచ్చింది. ఇలా ఎందరో సామాన్యులు తమ కరెంటు బిల్లులు చూసి షాకవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. రాష్ట్రంలో సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి విద్యుత్ బిల్లులు. తాజాగా ఓ చిన్న పెంకుటింట్లో జీవించే సామాన్యుడికి వేలల్లో కరెంట్ బిల్లు రావడంతో లబోదిబోమంటున్నాడు. అతని ఇంట్లో కనీస అవసరాలైన ఫ్యాన్, ఫ్రిజ్, ఏసీ, ఏవీ లేవు. అయినా అతనికి వందల్లో రావాల్సిన కరెంట్ బిల్లు ఏకంగా వేలల్లో వచ్చింది. ఇలా ఎందరో సామాన్యులు తమ కరెంటు బిల్లులు చూసి షాకవుతున్నారు. అల్లూరి ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపిల్లి పంచాయతీ.. చింటగున్నలు గ్రామానికి చెందిన పాంగి సుందర రావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పేద గిరిజన రైతు అయిన సుందరరావు ఇంట్లో కేవలం రెండు బల్బులు తప్ప… ఇతర విద్యుత్ ఉపకరణాలు లేవు. టీవీ లేదు.. ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా వినియోగించడం లేదు. వీరికి ప్రతినెలా వచ్చే కరెంట్ బిల్లు 300 రూపాయలు లోపే. గిరిజనుడు కావడంతో సబ్సిడీ కూడా వస్తుంది. అలాంటి ఇంటికి ఒక్కసారిగా లక్షల్లో కరెంట్ బిల్లు వేశారు. ఏకంగా లక్షా 5వేల 352 రూపాయలు..! వ్యవసాయంపై ఆధారపడే తాను ఇంత బిల్లు ఎలా చెల్లించాలంటూ గగ్గోలు పెడుతున్నాడు. అంతేకాదు.. ఇంత భారీగా కరెంట్ బిల్లు వస్తే తనకు వచ్చే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారేమో అనే భయం కూడా పట్టుకుంది. ఇటీవల ప్రభుత్వం పరిమిత యూనిట్లకు మించి విద్యుత్ ఖర్చు చేసేవారికి, ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తోంది. ఈ క్రమంలో ఆ పేద రైతు ఆందోళనకు గురవుతున్నాడు. ఓ వైపు భారీమొత్తంలో కరెంట్ బిల్లు, మరోవైపు ప్రభుత్వ పథకాలు ఏం చేయాలో తోచక లబోదిబోమంటున్నాడు. ఇటీవల సీపీఎం రక్షణ భేరి యాత్రలో.. ఈ విషయాన్ని తెలుసుకున్నారు సీపీఎం నాయకులు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం ఈ బిల్లు వ్యవహారంపై అధికారులు వెరిఫై చేస్తూ ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.