కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్‌ !!

Updated on: Apr 25, 2026 | 10:49 AM

ఒక వినియోగదారుడు తన క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని అభ్యర్థించినా, బ్యాంక్ నిర్లక్ష్యం వహించింది. వార్షిక రుసుములు వసూలు చేసింది. దీంతో ఆయన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం కార్డు క్లోజర్ ఆలస్యానికి రోజుకు ₹1000 చొప్పున ₹3.21 లక్షల భారీ పరిహారం పొందారు. మీ హక్కులను తెలుసుకోండి, పోరాడి విజయం సాధించండి.

తన రెండు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని 2025 లో కస్టమర్‌ ఈమెయిల్ ద్వారా బ్యాంకును కోరారు. రూ. 1 లక్షగా ఉన్న తన క్రెడిట్ లిమిట్‌ను బ్యాంకు అకస్మాత్తుగా రూ.10,000కు తగ్గించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెయిల్‌కు స్పందన రాలేదు. మరో రెండుసార్లు రిమైండర్లు పంపినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు ఏడాది తర్వాత 2026 ఏప్రిల్‌లో తన అకౌంట్లను పరిశీలిస్తున్నప్పుడు, ఆన్యుయెల్‌ ఫీజు కింద రూ.1,180 ఛార్జ్ చేసినట్లు కస్టమర్‌ గుర్తించారు. దీనిపై బ్యాంకును ప్రశ్నించగా, కార్డులు రద్దు కాలేదని సమాధానం వచ్చింది. బ్యాంకు వైఖరితో విసిగిపోయిన ఆ వినియోగదారుడు, నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు నోడల్ అధికారి రంగంలోకి దిగారు. ఈమెయిల్ ద్వారా కార్డు క్లోజర్ అభ్యర్థనలు స్వీకరించం కాల్ చేయాల్సింది అంటూ మొదట కస్టమర్ తప్పేనని వాదించారు. అయితే, తాను రాతపూర్వక అభ్యర్థన ఇచ్చానని, దానికి ఆధారాలున్నాయని బాధితుడు వాటిని చూపించారు. తాను పంపిన రిక్వెస్ట్‌లను సకాలంలో ప్రాసెస్ చేయకుండా, కార్డును క్లోజ్ చేయడంలో బ్యాంకు తీవ్ర నిర్లక్ష్యం వహించిందని తేలింది. అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు బ్యాంకుకు ప్రతికూలంగా మారింది. కొన్ని రోజుల తర్వాత పరిహారంగా కస్టమర్‌ బ్యాంకు ఖాతాలో రూ.3,21,000 జమ అయింది. కస్టమర్‌ ఈ విషయాన్ని రెడిట్ లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కార్డు క్లోజర్‌లో జాప్యం జరిగితే రోజుకు 500 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. తన విషయంలో రెండు కార్డులు కావడంతో రోజుకు రూ.1,000 చొప్పున 321 రోజుల జాప్యానికి రూ.3,21,000 పరిహారం లభించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు పోరాడి విజయం సాధించినందుకు కస్టమర్‌ ను అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే

35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Follow Us