Delhi Metro: ఢిల్లీ మెట్రోలో మరో పాడు పని.. నోట్లో కోక్ పోసుకుని.. అడ్డంగా కెమెరాకు చిక్కి..!
మెట్రో రైళ్లలో యువతీ యువకులు చేస్తున్న కొన్ని అసభ్యకరమైన పనులు.. వారితోపాటు ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముద్దులు, హగ్‌లు.. ఇంకాస్త ముందుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో తమ ఇష్టం వచ్చినట్లు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ జంట ప్రవర్తనకు నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ యువతీ యువకుడు మెట్రో రైలులో ప్రయాణిస్తూ వీడియో తీయించుకున్నారు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో అది […]
మెట్రో రైళ్లలో యువతీ యువకులు చేస్తున్న కొన్ని అసభ్యకరమైన పనులు.. వారితోపాటు ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముద్దులు, హగ్‌లు.. ఇంకాస్త ముందుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో తమ ఇష్టం వచ్చినట్లు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ జంట ప్రవర్తనకు నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ యువతీ యువకుడు మెట్రో రైలులో ప్రయాణిస్తూ వీడియో తీయించుకున్నారు. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో ఉంచడంతో అది తెగ వైరల్ కాగా.. నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. యువతి సీటుపై కూర్చోగా.. ఆమెకు ఎదురుగా కింద మోకాళ్లపై యువకుడు కూర్చున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇక ఆ యువకుడు ఒక కోక్ బాటిల్ మూత ఓపెన్ చేసి యువతి నోట్లో కూల్‌డ్రింక్ పోశాడు. ఆ తర్వాత తన నోట్లో ఉన్న కూల్‌డ్రింక్‌ను ఆ యువతి తన ఎదురుగా ఉన్న యువకుడి నోట్లోకి ఊదింది. అనంతరం అదే కూల్‌డ్రింక్‌ను యువకుడు కూడా ఆ యువతి నోట్లోకి ఉమ్మేశాడు. ఇలా ఒకరి నోట్లో నుంచి మరొకరి నోట్లోకి ఈ కూల్‌డ్రింక్‌ను పోసుకుంటూ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..