మభ్యపెట్టి చిన్నారిని తీసుకెళ్లిన కామాంధుడు.. ఆ తర్వాత

Updated on: Apr 20, 2026 | 7:53 PM

హైదరాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని కొందరు యువకులు సాహసంగా అడ్డుకున్నారు. బాలికను రక్షించి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. యువకుల సామాజిక బాధ్యతను, ధైర్యాన్ని సీపీ సజ్జనార్ కొనియాడారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో సమాజం స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఎన్ని చట్టాలు చేసినా.. ఎంతటి శిక్షలు వేసినా కామాంధులకు అడ్డుకట్ట పడటంలేదు. వయసుతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఓ కామాంధుడి బారినుంచి తొమిదేళ్ల చిన్నారిని కాపాడారు కొందరు యువకులు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. యువకులు చూపిన సాహసాన్ని అభినందించారు నగర పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జనార్‌. ఏప్రిల్‌ 14న యూసుఫ్‌గూడ నుంచి మాదాపూర్ వైపు సెజల్ అనే యువతి, తన స్నేహితుడు గణపతితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, రోడ్ నం.10 సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ వ్యక్తి చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గమనించారు. అనుమానం వచ్చిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బైక్ ఆపి, అటుగా వస్తున్న కాశీనాథ్, శ్రీనారాయణ అనే మరో ఇద్దరితో కలిసి నిందితుడిని అడ్డుకున్నారు. అతడిని పట్టుకుని వెంటనే డయల్ 100కు సమాచారం అందించి, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు యూసుఫ్‌గూడకు చెందిన జావిద్‌గా పోలీసులు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో, ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని నమ్మబలికి బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సామాజిక బాధ్యతతో స్పందించిన సెజల్, గణపతి, కాశీనాథ్, శ్రీనారాయణల ధైర్యసాహసాలను సీపీ సజ్జనార్ మెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో వారు చూపిన చొరవ సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులతో బ్యాంకుకు వచ్చారు.. 20 నిమిషాల్లో దోచేశారు

‘అమ్మా, నేను పాసయ్యా’.. మనసుల్ని గెలిచిన వీడియో

దోమల బెడద మధ్యే డ్యూటీ.. సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

అత్తను కాపాడేందుకు కోడలి సాహసం.. ఏం చేసిందో చూడండి

పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన పెరుగు

Follow Us