ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే

Updated on: Apr 25, 2026 | 10:35 AM

కర్ణాటకలోని చిక్కమగళూరులో సీఈటీ పరీక్షల్లో షాకింగ్ ఘటన జరిగింది. ముక్కుపుడకలు ధరించిన విద్యార్థినులను సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని తీయలేకపోవడంతో టేపులు అంటించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విద్యార్థినులు వీడియో విడుదల చేయడంతో నెట్టింట తీవ్ర చర్చ నడిచింది. పరీక్షల్లో అక్రమాలు నివారించడానికే నిబంధనలు పాటించామని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది, కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల హక్కులపై ప్రశ్నలు లేవనెత్తారు.

కర్ణాటకలో షాకింగ్‌ ఘటన జరిగింది. పరీక్షకు వచ్చిన విద్యార్థినులు ముక్కు పుడక పెట్టుకుని వచ్చారు. ఆ తర్వాత సిబ్బందిని వారిని చూసి ఏం చేశారో కొంతమంది అమ్మాయిలు వీడియో తీసి పోస్ట్‌ చేయడంతో నెట్టింట చర్చ మొదలైంది. సాధారణంగా పరీక్షలంటే ఒక్క నిమిషం నిబంధన కొందరి కొంప ముంచడం చూస్తుంటాం. పరీక్షకు సరిగ్గా అరగంట ముందే గేట్లు మూసేస్తామని అధికారులు ముందే హెచ్చరించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడం ఆలస్యంగా వచ్చిన వారంతా కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటాం. అలాగే నీట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ పాటించాలన్న నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు డ్రెస్‌ కోడ్ ను విధిగా పాటించాలి. పొడవు చేతులున్న ఫుల్‌ స్లీవ్స్‌ డ్రెస్‌లు, నగలు, మెటల్‌ వస్తువులకు నో ఎంట్రీ . వాచ్‌లు తీసుకెళ్లొచ్చా? అంటే అది కూడా లేదు. అలాగే, ఎలక్ట్రానిక్‌ డివైస్‌లను కూడా వెంట తీసుకెళ్లరాదు. అసలు విషయానికొస్తే కర్నాటకలోని చిక్కమగళూరు ఎంఈఎస్‌ కళాశాల సిబ్బందికి చిక్కొచ్చిపడింది. సీఈటీ పరీక్షలు జరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరీక్షలకు డిజిటల్ వాచ్, మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆభరణాలపై నిషేధం ఉంది. అయితే ముక్కు పుడకలు ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలపై కూడా చెకింగ్‌ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ముక్కుపుడక తీయడానికి సిబ్బంది ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. దాంతో వాటికి టేప్‌ అంటించారు. పరీక్షలు అయ్యాక.. టేప్‌ తొలగిస్తున్న వీడియో ను అమ్మాయిలు సోషల్‌ మీడియాలో వదిలారు. వీడియో పై తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇదేం విడ్డూరం అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకే చర్యలు తీసుకున్నామని.. రూల్స్‌ను ఫాలో అయ్యామని కాలేజీ యాజమాన్యం చెప్పింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!

Ajith: ఓటేసి నోరు జారిన అజిత్.. విజయ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దెబ్బకి వివరణ

Trisha: ఏదోటి క్రేజీగా చేయకుండా.. ఈమె ఉండదుగా..

TOP 9 ET: ఇంటర్నేషల్‌ వేదికపై ‘వారణాసి’ రిలీజ్‌ !! AA23 రేంజ్‌ ఊహించలేరు..

Follow Us