Phone Numbers: 55 లక్షల ఫోన్‌ నెంబర్లు రద్దు.! దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్..

|

Dec 21, 2023 | 8:13 PM

తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. నకిలీ ధృవపత్రాలతో పొందిన 55 లక్షల ఫోన్ నెంబర్లను కేంద్రం రద్దు చేసింది. కేంద్రం కొంతకాలంగా సంచార్ సాథీ పేరిట దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపడుతోంది. అక్రమ మార్గాల్లో పొందిన సిమ్ కార్డుల ద్వారా సైబర్ నేరాలు, ఇతర తప్పిదాలకు పాల్పడకుండా అడ్డుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే లక్షలాది సిమ్ కార్డులకు సరైన ధృవపత్రాలు లేవని గుర్తించారు.

కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ పార్లమెంటులో ఈ విషయం వెల్లడించారు. భారీ ఎత్తున వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టామని, తప్పుడు ధృవపత్రాలతో పొందిన 55.52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా, సైబర్ నేరాలకు ఉపయోగించిన 1.32 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేసినట్టు మంత్రి వివరించారు. దాంతోపాటే, పౌరుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా ఉన్న 13.42 లక్షల ఫోన్ కనెక్షన్లను కూడా నిలిపివేసినట్టు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.