చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్‌లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దొంగ క్లినిక్‌లోకి చొరబడబోయి షట్టర్, గోడ మధ్య ఇరుక్కుపోయాడు. రాత్రంతా నరకయాతన అనుభవించి, ఉదయం క్లినిక్ సిబ్బందికి కంటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని షట్టర్‌ను తొలగించి, ప్రాణాపాయంలో ఉన్న ఆ దొంగను సురక్షితంగా బయటకు తీశారు. చోరీకి వచ్చి చివరకు తానే ఇరుక్కున్న ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ దొంగకు ఎదురైన అనుభవం నిజంగా విచిత్రం.. కొంచెం నవ్వు తెప్పించేదిగా ఉన్నా, చివరికి ప్రాణాపాయం దాటిన సంఘటనగా మారింది. రాత్రి వేళలో ఓ క్లినిక్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆ దొంగ.. ఎవరూ లేని సమయం చూసుకుని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. షట్టర్‌ను కొద్దిగా ఎత్తి, గోడ మధ్య ఉన్న చిన్న గ్యాప్‌లోంచి లోపలికి వెళ్లాలని భావించాడు. కానీ అదే అతని పెద్ద తప్పుగా మారింది. లోపలికి వెళ్లే ప్రయత్నంలో అతని తల షట్టర్‌కి, గోడకు మధ్య ఇరుక్కుపోయింది. మొదట చిన్న సమస్య అనుకున్న అతను.. కాసేపటికి పరిస్థితి తీవ్రమైందని గ్రహించాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక.. గంటల తరబడి అక్కడే చిక్కుకుని విలవిల్లాడిపోయాడు. రాత్రంతా అలా ఇరుక్కుపోయిన ఆ దొంగ.. చివరికి ఉదయం క్లినిక్ తెరవడానికి వచ్చిన సిబ్బంది కంటపడాడు. షట్టర్ దగ్గర ఇరుక్కుని అల్లాడుతున్న దృశ్యం చూసి వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. కష్టపడి షట్టర్‌ను పైకి లేపి, గోడ భాగాన్ని సడలించి అతడిని బయటకు తీశారు. తీవ్ర అసౌకర్యంతో ఉన్నప్పటికీ, అతని ప్రాణాలను కాపాడారు. చోరీ చేయాలని వచ్చిన దొంగ.. చివరికి తానే చిక్కుకుని పోలీసుల చేతికి చిక్కడం ఈ ఘటనలో విశేషం. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశ్వంభరకన్నా ముందే స్వయంభు.. ఇప్పుడిదే టాపిక్
బాలీవుడ్‌లో వైరల్ అవుతున్న బయోపిక్‌లు
ముందుకొచ్చిన ఆదిత్య.. సందీప్ ఆలోచిస్తారా ??