బర్త్ డే రోజున కేక్ కొంటున్నారా.. అయ్యబాబోయ్‌..ఇది చూస్తే..

Updated on: Jun 15, 2026 | 8:29 PM

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో స్పేస్‌ఎక్స్‌ సంచలనం సృష్టించింది. ఎలాన్ మస్క్ సంస్థ మార్కెట్లోకి అడుగుపెట్టడంతో 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఒక్కసారిగా మిలియనీర్లుగా మారబోతున్నారు. ఒకప్పుడు బోనస్‌గా పొందిన షేర్ల విలువ ఇప్పుడు ఆకాశాన్ని తాకడంతో సాధారణ ఇంజినీర్లు, క్యాంటీన్ సిబ్బంది, క్లీనింగ్ ఉద్యోగుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి.

ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకలు, బేకరీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ కుటుంబానికి పీడకలగా మారాయి. కేకు తిన్న మూడేళ్ల బాలుడి పొట్టలోకి ప్రమాదకరమైన పిన్నులు వెళ్లిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో వెలుగుచూసింది. ఠాణెకు చెందిన రేయాన్ష్‌ అనే మూడేళ్ల బాలుడి పుట్టినరోజు కోసం కుటుంబ సభ్యులు ఒక ప్రముఖ బేకరీలో ‘బౌలింగ్ థీమ్’ కేకును ఆర్డర్ చేశారు. బంధుమిత్రుల మధ్య వేడుకగా కేకును కోసి, చిన్నారి రేయాన్ష్‌కు తినిపించారు. అయితే, కేకు అలంకరణ కోసం పైన ఉంచిన బంగారు వర్ణపు పిన్నులకు లోపలి వైపు పదునైన లోహపు తీగలను కత్తిరించి అమర్చారు. కేకు తింటున్న మిగతా పిల్లలు ఆ పిన్నులను గుర్తించడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికే రేయాన్ష్‌ పొట్టలోకి రెండు మెటల్ పిన్నులు వెళ్ళిపోయాయి. తల్లడిల్లిపోయిన కుటుంబ సభ్యులు బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు కడుపులో పిన్నులు ఉన్నట్లు గుర్తించారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, మల విసర్జన సమయంలో అవి సహజసిద్ధంగా బయటకు వచ్చేస్తాయని ధైర్యం చెప్పారు. వైద్యులు చెప్పినట్లే మరుసటి రోజు ఆ పిన్నులు బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ చేదు అనుభవంపై బాలుడి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. “కేకు అలంకరణ కోసం లోహపు పిన్నులు వాడినట్లు బేకరీ వారు మాకు చెప్పలేదు. ఆ రాత్రి ఆసుపత్రిలో మాకు కాళరాత్రిలా గడిచింది. బేకరీ నిర్వాహకులు ఇలాంటి ప్రమాదకరమైన డెకరేషన్స్ వాడినప్పుడు ముందే చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు కేకులు తినిపించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి” అని ఆమె కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల

Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

Follow Us