భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో

Updated on: May 29, 2026 | 3:51 PM

తమిళనాడుకు చెందిన పూల్ పాండియన్ అనే వృద్ధుడు భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బును ప్రభుత్వ సహాయ నిధులకు విరాళంగా ఇస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా సమయంలో రూ.50 వేల విరాళం ఇచ్చిన ఆయన, ఇటీవల కూడా రెండు విడతల్లో రూ.20 వేలు అందజేశారు. తనకు వచ్చిన ప్రతి రూపాయిని సమాజం కోసం వినియోగిస్తున్న ఈ వృద్ధుడు నిజమైన సేవాభావానికి ప్రతీకగా నిలిచారు.

మనం చాలామంది యాచకులను చూస్తాం. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్డుమీద యాచకులు భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. కొందరు తమ పొట్ట నింపుకోడానికి భిక్షాటన చేస్తారు. తాము యాచించి సంపాదించిన మొత్తాన్ని ఇతరులకు విరాళంగా ఇవ్వడం ఎక్కడైనా చూశారా.. సమాజంలో కొందరు ఎంత సంపాదించినా దాచుకోవాలనే చూస్తారు. కానీ, చేతిలో రూపాయి లేకపోయినా.. భిక్షాటన చేస్తూ వచ్చిన పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వ సహాయ నిధికి లక్షలాది రూపాయలు విరాళంగా ఇస్తూ ఒక వృద్ధుడు రియల్ హీరోగా నిలిచారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళంకు చెందిన పూల్‌ పాండియన్‌ అనే వృద్ధుడు గతంలో ముంబైలో చిన్న ఉద్యోగం చేసేవారు. ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కావడం, భార్య మరణించడంతో 2019లో ఆయన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. అప్పటి నుండి ఆయన తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు బెంగళూరులోనూ భిక్షాటన చేయడం ప్రారంభించారు. అలా యాచకవృత్తి ద్వారా వచ్చిన సొమ్మును దాచుకుని, కొంత పెద్దమొత్తం కాగానే ఎక్కడికక్కడ కలెక్టర్లను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నారు. కరోనా కష్టకాలంలో మదురై కలెక్టర్‌కు ఏకంగా 50 వేల రూపాయలు అందించి అందరి దృష్టిని ఆకర్షించిన పూల్‌పాండియన్.. ఇటీవల మదురై వచ్చి కేవలం వారం వ్యవధిలోనే మార్చి 18న రూ. 10 వేలు, తిరిగి 25న మరో రూ. 10 వేలు కలెక్టర్‌కు విరాళంగా ఇచ్చారు. ఒక్క వారంలోనే ఇంత మొత్తం ఎలా సాధ్యమైందని విలేకరులు ప్రశ్నించగా, భిక్షాటన ద్వారానే ఇదంతా సేకరించానని ఆయన నిగర్వంగా చెప్పారు. ఇప్పటివరకు పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూడా సాయం చేసిన ఈయన పెద్ద మనసుకు ముగ్ధులై, ప్రస్తుతం పలువురు దాతలు ఆయనకు నేరుగా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

Follow Us