బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్‌ షాక్‌

Updated on: May 23, 2026 | 8:59 AM

సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీరు బాటిల్‌లో ఖాళీ కండోమ్ ప్యాకెట్ కనిపించడం కలకలం రేపింది. గ్లాసులో బీరు పోస్తుండగా లోపల ప్యాకెట్ తేలుతూ కనిపించడంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బ్రాండెడ్ కంపెనీల నాణ్యత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రోజంతా కష్టపడి అలసిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవుదామని బీరు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. బీరు సీసా సీలు తీసి గ్లాసులో పోస్తుండగా.. అందులో ఏకంగా ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షమయింది. అదిచూసి సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి ప్రాంతంలోని ఓ వైన్ షాప్‌లో ఈ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి సాయంత్రం ఓ వైన్ షాప్ నుండి ఒక బ్రాండెడ్ బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోస్తుండగా, లోపల ఏదో ప్యాకెట్ తేలుతూ స్పష్టంగా కనిపించింది. పరిశీలించి చూడగా అది కండోమ్ ప్యాకెట్ అని తేలడంతో అతని గుండె ఆగినంత పనైంది. వెంటనే ఈ విషయాన్ని వైన్ షాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా, స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో మద్యం ప్రియులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్న మద్యం విషయంలో కంపెనీలు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల బాటిలింగ్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నిర్లక్ష్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!

Follow Us