తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు

Updated on: Mar 20, 2026 | 8:42 PM

బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఓ కూతురు తన తండ్రిని బస్తాలో కుక్కి కొరియర్ చేయబోయింది. కొరియర్ సిబ్బందికి అనుమానం వచ్చి బస్తా తెరవగా విషయం బయటపడింది. ప్రస్తుతం తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితురాలిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన సోషల్ మీడియా పిచ్చి పరాకాష్ఠకు నిదర్శనం.

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా వెనుకాడటం లేదు. ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరిన ఓ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. రీల్స్ కోసం బెంగళూరులో ఓ కూతురు తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడింది. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరక్కపోతే పడే ఇబ్బందులను చెప్పడానికి.. తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. కానీ గోనె సంచిలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో నివసించే ఓ యువతి.. తన తండ్రిని పెద్ద బస్తాలో కుక్కింది. ఆ తర్వాత బస్తాకు దారం కట్టి.. ఓ ప్రైవేటు కొరియర్ సంస్థకు కాల్ చేసింది. తన వద్దర భారీ పార్సిల్ ఉందని డెలివరీ చేయాలని కోరారు. దీంతో యువతి ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది బస్తాను నేరుగా కొరియర్ ఆఫీసుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బస్తాలో ఏదో కదులుతున్నట్లు సిబ్బంది గమనించారు. దీంతో ఆఫీసుకు వచ్చాక బస్తాను తెరవాలని యువతిని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో స్వయంగా సిబ్బంది గోనె సంచిని తెరిచి చూడగా.. అందులో ఓ వ్యక్తి కనిపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు కొరియర్ సిబ్బంది సమాచారం అందించారు. కొరియర్ ఆఫీసుకు వచ్చిన పోలీసులు.. గోనె సంచిలోని వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో క్షమాపణలు చెబుతూ యువతి ఓ వీడియో చేసింది. ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో బస్సు టికెట్లు తరచుగా అందుబాటులో ఉండవు. ఆ సమయంలో ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలియజేయడానికే ఈ వీడియో చేశానని యువతి అందులో తెలిపింది. వీడియోలో సదరు యువతి, ఆమె అత్త, భర్త ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gas Crisis: గ్యాస్‌ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితుల కస్టడీపై తీర్పు వాయిదా..

మొయినాబాద్ ఎపిసోడ్ తో తెరపైకి వైట్ ఛాలెంజ్

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ కానుక

Petrol Prices: భారత్ లో పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

Follow Us