ఆగస్టులో వినాశనం.. బాబా వంగా జోస్యం నిజం కానుందా? వీడియో

Updated on: Aug 11, 2025 | 7:20 AM

బాబా వంగా జోస్యాలు తలుచుకుంటే వెన్నులో వణకు పుడుతుంది. ఆమె బతికున్నపుడు చెప్పినవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవర పెడుతున్న విషయం ఏంటంటే.. 2025 ఆగస్టులో ‘డబుల్ ఫైర్’ జరుగుతుందని ఆమె చెప్పడం. లుథియేనియన్ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం.. ఆమె చెప్పిన ‘డబుల్ ఫైర్’ వెనుక అంతరార్థం ఏంటో ఎవ్వరికీ తెలీదు.

బాబా వంగా జోస్యం చిత్రంగా ఉంది. ‘ 2025 ఆగస్ట్‌లో ఓ చెయ్యి రెండుగా విడిపోతుంది. రెండు చేతులు చెరో దారిన వెళ్లిపోతాయని ఆమె అన్నారు. ఆమె అన్నదానికి అర్థం ఏంటో ఎవ్వరికీ క్లారిటీ లేదు. బహుశా డబుల్ ఫైర్ అంటే.. రెండు విధాలుగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఒకటి భూమ్మీద రెండోది ఆకాశంలో.. భూమ్మీద అంటే.. అడవులు తగలబడతాయా లేదా అగ్ని పర్వతం బద్ధలవుతుందా అన్నది చూడాలి. ఆకాశంలో నుంచి ఉల్క భూమిపై పడే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. ప్రపంచ దేశాల ప్రజలు ఆమె ఏం చెప్పిందో అర్థంకాక, ఎవరికి వారు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో ఆమె భవిష్యత్‌ వాణిగా చెప్పిన 9/11 దాడులు, భూకంపాలు, సునామీలు జరగడం ప్రపంచం చూసింది. 2025లో ఈ భూమ్మీదకు ఎలియన్స్ వస్తాయని కూడా ఆమె చెప్పారు. ఆమె చెప్పినవన్నీ జరుగుతాయో లేదో వేచి చూడాలి మరి.

మరిన్ని వీడియోల కోసం :

భయానకం పిడుగు .. వామ్మో ఆకాశమే తగలబడిందా అన్నట్లు వీడియో!

ఆ గ్రామంలో ఒకే ఒక్కడు..వీడియో

టీవీ రిపేర్ చేస్తామని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి..కాసేపటికే సీన్ సితార్!