భార్య బికినీ వేసుకునేందుకు.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసాడు..
డబ్బుంటే ఏదైనా చేయగలరని, ఖర్చు పెట్టేందుకు ధనవంతులు ఎలాంటి సంకోచం లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా ముందుంటారని నిరూపించాడో అరబ్ షేక్. భార్య బికినీ వేసుకోవాలని ఉందని భర్తతో చెప్పగా ఆమె కంఫర్ట్ కోసం ఏకంగా ఐలాండ్‌నే కొనిచ్చాడు భర్త. అవును.. అరబ్ మిలియనీర్ జమాల్ అల్ నడక్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. సొసైటీలో గొప్ప హోదా ఉంది.
అయితే ఆయన భార్య సౌది అల్ నడక్ బికినీ వేసుకోవాలని, స్విమ్మింగ్ చేయాలని ఉందని చెప్పగా.. ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. సముద్రతీరంలో హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు, అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని స్వయంగా సౌది అల్ నడక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న సౌదీకి మూడు లక్షల మంది ఫాలోవర్లున్నారు. తన భర్త ఆమెకు ఇచ్చే కాస్ట్‌లీ కానుకలు, డైమండ్స్, జ్యువెల్లరీ, కళాఖండాలు ఇలా ప్రతీ విషయాన్ని షేర్ చేస్తుంది. తమ కమ్యూనిటీలో బికినీ ధరించడంపై ఆంక్షలు ఉంటాయని.. అందుకే ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాడని ఇన్‌స్టా స్టోరీస్‌లో తెలిపిన ఆమె.. ఇది తనకు కంఫర్ట్ ఇవ్వడంతోపాటు తన భర్త స్థిరాస్థిపై పెట్టుబడి పెట్టినట్లు చెప్పింది. కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై పొగడ్తల వర్షం కురిపిస్తే.. మరికొందరు మాత్రం విమర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండ తగలని జీవితాలు.. ఆ లోపం తో బాధపడుతున్న మెజార్టీ పీపుల్
మాంసం వినియోగంలో ఆ దేశం టాప్.. భారత్ చాలా వెనుక
ఈ కొండముచ్చు ఆసనాలు చూస్తే.. యోగా గురువులు కూడా బలాదూర్
మలాశయం ద్వారా ఆక్సిజన్.. జపనీస్ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్ !!
వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
